Thalliki Vandanam: ఏకంగా 12 మంది పిల్లలకు రూ.1.56 లక్షలు జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh Government ) ఎన్నికల హామీ మేరకు ‘తల్లికి వందనం’ పథకాన్ని ( Thalliki Vandanam Scheme ) ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.13,000 నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. (రూ.15,000లో రూ.2,000 పాఠశాల నిర్వహణకు) ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పేరుతో ఇచ్చిన పథకంలో ఒక కుటుంబంలో ఒక్క పిల్లకే లబ్ధి ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎంత మంది పిల్లలు చదువుతున్నా, అంత మందికీ డబ్బు ఇస్తున్నారు.

అన్నమయ్య జిల్లా కలకడ గ్రామానికి చెందిన ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలు చదువుతున్నారు. వారికి చెందిన నాలుగు తల్లుల ఖాతాల్లో మొత్తం రూ.1.56 లక్షలు జమ కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు దేశం పార్టీ తమ X (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసి ప్రచారం చేస్తోంది. పథకం పేద కుటుంబాల పిల్లలు చదువు ఆగకుండా చూడడమే లక్ష్యం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.