బంగ్లా సంచలన తీర్పు దేశ ప్రధానికి ఉరిశిక్ష: ఏడాదిన్నర కిందట బంగ్లాదేశ్ లో జరిగిన ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దాదాపు 15 నెలలుగా ఢిల్లీలోనే ఉంటూ వస్తుంది. అయితే తాజాగా బంగ్లాదేశ్ కోర్టు షేక్ హసీనా పై సంచలన తీర్పు వెల్లడించింది.
తమ దేశంలో జరిగిన హింసకాండకు మాజీ ప్రధానిని బాధ్యురాలిని చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా వల్ల దాదాపు 1500 మంది పౌరులు మరణించారని కోర్టు తీర్మానించింది. అంతే కాకుండా పౌర హక్కులకు భంగం కలిగిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగంతో హసీనాకు బంగ్లా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే గత ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ లో మూడోసారి అధికారాన్ని చేపట్టిన షేక్ హసీనాపై ఆరు నెలల కాలంలో ప్రజల తిరుగుబాటు మొదలైంది.
అయితే గత ఏడాది షేక్ హసీనా తీసుకున్న ఒక్క నిర్ణయం దేశ ప్రజల వ్యతిరేకతకు ఆజ్యం పోసిందని చెప్పాలి. బంగ్లాదేశ్ దేశ స్వతంత్రంలో పాల్గొన్న వారి వారసులకు దేశంలో ప్రత్యేక రిజర్వేషన్ల పొడిగింపు నిర్ణయం బంగ్లా ప్రజల ఆందోళనకు ప్రధాన కారణం అయింది. అలాగే షేక్ హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ పార్టీ నేతల అవినీతి కూడా ఈ ఆందోళనలకు కారణమయ్యాయి. ఈ క్రమంలో జులై ఆగస్ట్ మధ్య కాలంలో నిరసనకారులను చంపేయమని ప్రధాని ఆదేశాలిచ్చినట్టుగా బంగ్లా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రెబ్యునల్ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఇందులో భాగంగా దాదాపు 1500 మంది ప్రజలు చనిపోయారని ఎన్నో వేల మంది గాయాలపాలయ్యారని, మానవత్వానికి వ్యతిరేకంగా షేక్ హసీనా పలు నేరాలకు పాల్పడ్డారని కోర్టు తెలిపింది.
అయితే షేక్ హసీనా పై అఫిషియల్ గా తీర్పు ఇంకా ప్రకటించలేదు. అతి త్వరలోనే వెల్లడించబోతున్నందున.. బంగ్లా రాజధాని ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడినా దాడులకు దిగినా కాల్చివేయాలంటూ కోర్టు ఆర్మీకి ఆదేశాలిచ్చింది. ఇక షేక్ హసీనాను వెంటనే తమకు అప్పగించాలంటూ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం భారత్ ను కోరింది. అయితే భారత ద్వేషి అయిన బంగ్లా ప్రస్తుత ప్రభుత్వ సారధి యూనస్ భారత్ పై వ్యతిరేకతను పలు వేదికల్లో వెళ్లగక్కడం వల్ల, భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
