టాలీవుడ్ లో రెండు రోజుల కిందట పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలతో సినీ ప్రియులు ఎదురుచూస్తున్న రాజమౌళి – మహేష్ బాబు ల కాంబోలో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ తో సహా టైటిల్ రివీల్ చేసిన సంగతి తెల్సిందే. ‘గ్లోబ్ త్రోట్టర్’ పేరిట ట్రెండ్ అయిన ఈ సినిమాకు “వారణాసి” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు రివీల్ చేసారు. అయితే టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ చేసినరోజున రాజమౌళి అనుకోకుండా చెప్పిన కొన్ని మాటలు వివాదాస్పదమయ్యాయి.
వివరాల్లోకి వెళితే వారణాసి ఈవెంట్ లో టైటిల్ గ్లిమ్ప్స్ లేట్ అయిందని అలాగే మరికొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాజమౌళి కాస్త అసహనం వ్యక్తం చేస్తూ, తనకు దేవుడంటే నమ్మకం లేదని, హనుమాన్ ని నమ్మితే ఈవెంట్ ఇలా జరుగుతుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేసారు. అయితే ఈవెంట్ లో హనుమాన్ పై రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలకు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రీయ వానరసేన సంఘం వారు తాజాగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. దీనికి రాజమౌళి తన సంజాయిషీ వెంటనే ఇవ్వాలని వారు కోరారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఇదే విషయంపై రాజమౌళి పై కేసు పెట్టారు.
ఇదిలా ఉండగా వారణాసి టైటిల్ విషయంలో కూడా రచ్చ జరుగుతుంది. వారణాసి టైటిల్ హక్కులు తమవని రాజమౌళి కంటే ముందే సి.హెచ్ సుబ్బారెడ్డి అనే దర్శకుడు ఫిలిం ఛాంబర్ లో పేరు రిజిస్టర్ చేయించారని ప్రముఖ నిర్మాత విజయ్ పిర్యాదు చేసారు. ఇక రాజమౌళి వారణాసి సినిమా ఈవెంట్ ఎంతలా వైరల్ అయిందో ఈ సినిమా చుట్టూ అన్ని వివాదాలు అల్లుకుంటున్నాయని తెలుస్తుంది. మరి దర్శకుడు రాజమౌళి ఎప్పుడు ఈ వివాదాలకు చెక్ పెడతాడో చూడాలి.
