టాలీవుడ్ లో ఈ ఇయర్ రాబోతున్న సినిమాల్లో అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. రిలీజ్ డేట్ దగ్గ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా అఖండ ఫస్ట్ పార్ట్ నార్త్ లో ఓటిటి భారీగా క్లిక్ అవడం వల్ల, సీక్వెల్ ని హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. టీజర్ కి కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా అఖండ 2 కి హిందీలో గట్టి దెబ్బ పడే అవకాశం కనిపిస్తుంది.
బాలీవుడ్ లో తాజాగా రణవీర్ సింగ్ నటించిన “దురంధర్” సినిమా ట్రైలర్ రిలీజ్ అయి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. భారీ తారాగణం ఉన్న ఈ సినిమా కూడా డిసెంబర్ 5నే రిలీజ్ కాబోతున్నందున అఖండ 2 కి హిందీలో థియేటర్ల పరంగా అటు కలెక్షన్లలో దెబ్బ పడే అవకాశం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అఖండ 2 కి యానానిమస్ గా హిందీ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ వస్తే తప్ప అక్కడ లెక్కలు మారే పరిస్థితి లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదే పరిస్థితి గతంలో చిరంజీవి సైరా సినిమాకి వచ్చింది. ఆ మూవీ కి హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా సైరా రిలీజ్ అయిన రోజే హిందీలో హృతిక్ రోషన్ “వార్” సినిమా భారీ హైప్ తో రిలీజ్ అయింది. అందువల్ల సైరాని అంతగా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు అఖండ2 విషయంలో ఏం జరుగుతుందో ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. ఇదిలా ఉండగా అఖండ2 ట్రైలర్ ని కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ 21 లాంచ్ చేయనున్నారు.
