CP Sajjanar issues legal advice to the public

వాళ్ళ జోలికొస్తే క్రిమినల్ కేసు.. గుర్తుంచుకోండి – సీపీ సజ్జనార్

రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా పలు చోట్ల చిన్న చిన్న కారణాలతో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగడం గురించి వింటూనే ఉన్నాం. తాజాగా ఓ బస్సు డ్రైవర్ పై అకారణంగా ఓ కారు ఓనర్ తన దారికి అడ్డుగా ఉన్నాడని బస్సెక్కి ప్రయాణికులు అడ్డుకున్నా సరే డ్రైవర్ పై చేయి చేసుకోవడం నెట్టింట వైరల్ అవడమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనిపై తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేసారు.

తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ, ప్రభుత్వ నిధులు నిర్వహిస్తున్న వారిపై అకారణంగా దాడులు చేసినా, లేక వారి విధులకు ఆటంకాలు కలిగించినా తీవ్ర నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానమని.. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే వారిపై భారత న్యాయ సంహిత (BNS) లో 221,132,121(1) సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు కూడా పెట్టవచ్చని హెచ్చరించారు. అందువల్ల ప్రజలు ఇది అర్ధం చేసుకుని చట్ట బద్ధంగా గౌరవంగా ఉద్యోగులతో వ్యవహరించాలని సిపి సజ్జనార్ కోరారు.