ఇండియాలో ఓటిటి లో భారీగా సక్సెస్ అయిన వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కూడా ఒకటి. రాజ్ & డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ సస్పెన్స్ & స్పై థ్రిల్లర్ గా తెరకెక్కగా ఓటిటి వెబ్ సిరీస్ లలో వన్ అఫ్ ది బెస్ట్ గా నిలిచింది. ఇందులో మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్రలో నటించగా ప్రియమణి ఆయనకు జోడిగా నటించింది. ఇక దీని తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కూడా విపరీతంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అందులో సమంత విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ నుండి తాజాగా సీజన్ 3 కూడా వచ్చేసింది.
ఈరోజున అంటే నవంబర్ 21న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ 3 వ సీజన్ కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటుంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 లో మనోజ్ బాజ్ పాయి, ప్రియమణి తో పాటు, నిమ్రత్ కౌర్, జైదీప్ అల్లావత్ విలన్ లుగా నటించారు. అలాగే షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరి, గుల్ పనాగ్, అశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఈ మూడవ సీజన్లో కూడా ఒక్కో ఎపిసోడ్ 45 నుండి 55 మధ్య ఉండనుందని తెలుస్తుంది. మొత్తం ఎపిసోడ్స్ కలిపి దాదాపు ఐదున్నర గంటల వరకు స్ట్రీమింగ్ ఉండనుందని సమాచారం. మరి రిలీజ్ అయిన ఒక్కరోజులోనే టాక్ ని పూర్తి స్థాయిలో డిసైడ్ చేయలేము. ప్రేక్షకుల నుండి ఈ వెబ్ సిరీస్ ఎంతవరకు రెస్పాన్స్ ని రాబడుతుందో చూడాలి.
