Winter Season tips

చలిపులికి విరుగుడుగా ఈ అద్భుతమైన టిప్స్…

శీతాకాలం అంటే ప్రకృతి ప్రియులకు ఎంతో ఇష్టం. ప్రకృతిలో ఎన్నో అందాలు ఈ కాలంలోనే ఎక్కువగా ఆస్వాదిస్తారు ప్రజలు. అయితే ఈ చలికాలంలో అనేక రకాలుగా చలి నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ శీతాకాలం మొదలై ఆల్రెడీ నెలన్నర కావస్తుండగా, ఇన్నిరోజులు కాస్త మామూలుగానే వాతావరణం ఉండగా, ఈ డిసెంబర్ జనవరి నెలల్లో చాలా ఎక్కువగా ఎముకలు కొరికే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. అయితే ఇలాంటి వాతావరణంలో ప్రజలు చలి పులి నుండి కాపాడుకొవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటించక తప్పనిసరి. ఆ టిప్స్ పాటిస్తే చలి పులి పంజా నుండి సగం వరకు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.

  • అందులో మొదటగా శరీరానికి వెచ్చగా ఉండేలా వేడినిచ్చే దుస్తులు, స్వెటర్లు వంటివి వేసుకోండి. దీని ద్వారా శరీరానికి వీలైనంత వేడి దక్కుతుంది.
  • ప్రకృతి నుండి దక్కే సూర్య రశ్మిని ఉదయం పూట వీలైనంత ఎక్కువ తీసుకోండి. ఇంట్లో తలుపులు తెరిచి వీలైనంత వరకు సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చేలా చేయడం వల్ల ఇంట్లో వేడి టెంపరేచర్ కాస్త పెరుగుతుంది. అలాగే ఎండలో కనీసం అరగంటైనా కూర్చోడానికి ప్రయత్నించండి.
  • ఆహారంలో వేడి పదార్ధాలు తీసుకోండి. అన్నం మొదలుకొని కూరగాయలు, టీ, మంచి నీళ్లు వేడిగా తీసుకొవడానికి ప్రయత్నించండి. కూల్ డ్రింక్స్ ఈ కాలంలో అవైడ్ చేయడం మంచిది.
  • అలాగే శరీరానికి వేడిని కల్గించే ఆహార పదార్ధాలు, అంటే బంగాళాదుంప, వంకాయ, గుడ్లు, చేపలు వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకొండి.
  • ఇక ఫైనల్ గా మనిషికి శారీరక శ్రమ కూడా ఎంతో అవసరం. అందుకని శీతాకాలంలో ఏవైనా వ్యాయామాలు చేయడం మంచిది. రన్నింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇంట్లో మొక్కల దగ్గర పని చేయడం, శరీరానికి పని చెప్తూ ఏదో ఒక పని చెప్తూ బాడీలో వేడిని పుట్టించాలి.