Team India's defeat against South Africa Gambhir's career in question?

టీమిండియా ఘోర పరాజయం.. గంభీర్ కెరీర్ ప్రశ్నార్థకం?

దక్షిణాఫ్రికాతో తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఈరోజు గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా 408 పరుగుల తేడాతో ఊడిపోవడం గమనార్హం. ముందుగా సౌతాఫ్రికా సెట్ చేసిన 547 పరుగుల టార్గెట్ ని ఛేదించే క్రమంలో రెండో సారి బరిలో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 0-2 తేడాతో సిరీస్ ని కోల్పోయింది. సొంత గడ్డపై ఎన్నో రికార్డులను నెలకొల్పిన టీమిండియా ఇలా వైట్ వాష్ కావడంతో నెట్టింట కోచ్ గౌతమ్ పై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి.

అయితే మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ సమాధానాలిచ్చారు. తన గురించి మాట్లాడుతూ తనను టీమిండియా కోచ్ గా కొనసాగించాలా వద్దా అనేది పూర్తిగా బిసిసిఐ నిర్ణయం. ప్రస్తుత ఓటమి కన్నా తనకు గత విజయాలు, రాబోయే విజయాలే ముఖ్యం అని, అంతే తప్ప తన పదవిపై ఏ ఆశ లేదని వ్యాఖ్యానించాడు.

అయితే మొన్నామధ్య న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత కొద్దీ రోజుల్లోనే సౌత్ ఆఫ్రికా చేతిలో మళ్ళీ క్లీన్ స్వీప్ కావడం వల్ల, గత చివరి 18 టెస్టులలో 9 ఓడిపోవడంతో గంభీర్ పై తీవ్ర విమర్శలొస్తున్నాయి. అలాగే జట్టులో వెంటవెంటనే ప్లేయర్లను ఊరికే మారుస్తూ ఉండడం వల్ల ఏ జోడి సెట్ కావడం లేదని తెలుస్తుంది. ఇవన్నీ గంభీర్ కెరీర్ ని ప్రశ్నార్థకం గా మారుస్తున్నాయని నెట్టింట ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే త్వరలో ఐపీఎల్ ప్రారంభమయ్యే లోపు టీమిండియా గంభీర్ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.