బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని రోజులుగా
భారతదేశంలో బంగారం నిలగడగా ఉంటూ, మెల్లిగా కొన్ని వందలు వందలుగా తగ్గుతూ రాగా, మళ్ళీ పాత రోజులు వస్తాయేమో అని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతో ఎదురుచూసాయి. కానీ ఇంతలోనే సామాన్యుడికి చుక్కలు చూపిస్తూ ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగిపోయాయి. మొన్నటి వరకు తులం బంగారానికి లక్షా ఇరవై అయిదువేల వరకు (1,25,000) ఉన్న బంగారం గత రెండు రోజుల్లో మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయింది.
పది గ్రాముల బంగారంపైన వరుసగా రెండు రోజుల్లో రెండు వేల వరకు పెరిగిన బంగారం తాజాగా మరో 870 వరకు పెరగడంతో లెక్కలు మారిపోయి సామాన్యుడికి బంగారంపై ఆసక్తి తగ్గేలా చేస్తున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర ₹1,27,910 రూపాయల వరకు ఉంది. ఇదే విధంగా కొనసాగుతూ ఉంటె లక్షా ముప్పై వేలని దాటే అవకాశం ఉంది. మరి పెళ్లిళ్ల సీజన్ కూడా త్వరలో ముగియనుండటంతో లెక్కలు ఏమైనా మారతాయేమో చూడాలి.
