టాలీవుడ్ లో డాన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ఆ మధ్య డాన్స్ విషయంలో మహానటి కీర్తి సురేష్ ఓ తమిళ ఇంటర్వ్యూ లో చిరంజీవి – విజయ్ ఎవరు బెస్ట్ అంటే, కీర్తి నిర్మొహమాటంగా విజయ్ అని చెప్పింది. అయితే అప్పట్నుంచి తెలుగులో కీర్తిని మూవీ లవర్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ విషయాన్నీ కీర్తి పెద్దగా పట్టించుకోలేదు గాని, తాజాగా దీని ప్రస్తావన మళ్ళీ వచ్చింది. అయితే కీర్తి ఈ టాపిక్ కి స్పందించి చెక్ పెట్టింది.
తాజాగా కీర్తి సురేష్ నటించిన “రివాల్వర్ రీటా” మూవీ ప్రమోషన్ లో భాగంగా రెండు రోజుల కిందట ఏర్పాటైన ప్రెస్ మీట్ లో కీర్తి సురేష్ కి ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ, అప్పట్లో చిరంజీవి కన్నా విజయ్ గ్రేట్ డాన్సర్ అన్నారు. దానిపై తెలుగు ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు, దీనిపై కీర్తి ఎలా స్పందిస్తారు అని అడిగాడు. దానికి కీర్తి సింపుల్ గా ఇలా బదులిచ్చింది. కీర్తి మాట్లాడుతూ, తనకు విజయ్ డ్యాన్సులంటే ఇష్టమని మెగాస్టార్ చిరుకి కూడా చెప్పానని, ఆయన కూడా చాలా స్పోర్టివ్ గానే తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ఇక చిరంజీవితో భోళా శంకర్ లో ఆయనకీ చెల్లెలిగా నటించిన విషయం తెలిసిందే. ఆ షూటింగ్ సమయంలో కూడా విజయ్ డాన్సుల గురించి ప్రస్తావన తీసుకొచ్చిందట కీర్తి.
ఇదిలా ఉండగా కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా మూవీ ఈరోజు రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం కీర్తి చేతిలో తెలుగు ప్రాజెక్టులు ఏమి లేవని సమాచారం.
