rohith sharma - virat kohli pair set all time record

ఆల్ టైం రికార్డు సెట్ చేసిన రోహిత్ – కోహ్లీ జోడి

టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ తమ రికార్డుల పరంపరని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొత్తవాళ్లకు అవకాశాలిచ్చే క్రమంలో మెల్లిగా తమ మ్యాచ్ లను తగ్గిస్తున్నా, ఆడినప్పుడల్లా ఏదో ఒక రికార్డు సెట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా టెస్ట్ మ్యాచ్ వైఫల్యం ఎదుర్కున్న టీమిండియా, తాజాగా సౌతాఫ్రికా తో వన్డే మ్యాచ్ తో తేరుకుంది. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చేసి ఖుషి చేసారు. ఇదిలా ఉండగా ఇండియా – సౌతాఫ్రికా వన్డే సిరీస్ లో భాగంగా రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ జోడి మరో అరుదైన రికార్డు సెట్ చేసేసారు.

రాంచి లో జరిగిన తొలి వన్డే ద్వారా ఓ అరుదైన రికార్డు ఈ ఇద్దరూ బ్రేక్ చేసారు. వీరిద్దరూ కలిసి భారత్ తరపున అత్యధిక వన్డేలు (392) ఆడిన జోడిగా రికార్డు సాధించారు. ఇప్పటిరవరకు అత్యధిక మ్యాచ్ లు ఆడిన జోడిగా నిలిచిన సచిన్ టెండూల్కర్ – రాహుల్ ద్రావిడ్ ల (391) ల రికార్డును ఇప్పుడు రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీలు బ్రేక్ చేసేసారు. ఇక వీరి తర్వాతి రికార్డులు కూడా సచిన్ ఇతర స్టార్ ప్లేయర్లతో పంచుకున్నాడు. వీరి తర్వాత ఇప్పుడు మూడో స్థానంలో సౌరవ్ గంగూలీ – ద్రావిడ్ (369) మ్యాచ్‌ లు, సచిన్ – కుంబ్లే జోడీ (367) మ్యాచ్ లు, ఆ తర్వాత సచిన్ – గంగూలీ జోడి (341) మ్యాచ్ లు కలిసి టీమిండియా కు ఆడడం జరిగింది.