గత ఏడాది కాలంలో బంగారం ధరలు ఇండియాలో ఏ రేంజ్ లో పెరిగిపోయాయో తెలిసిందే. కేవలం రెండేళ్ల కాలంలోనే బంగారం రేటు డబుల్ అయింది. లాక్ డౌన్ తర్వాత అరవై వేల నుండి మెల్లిగా పెరుగుతూనే పోతున్న బంగారం ధరలు ఏడాది కిందటి వరకు రెండు మూడు నెలలకు 10 గ్రాముల బంగారానికి వెయ్యి అలా పెరుగుతూ వస్తుండగా, గత ఏడాదిగా మాత్రం నెలకు ఏకంగా నాలుగు ఐదు వేలు పెరుగుతూ వచ్చింది. దీంతో సామాన్యులకు మధ్యతరగతి వారికి బంగారం పై ఆశలు వదులుకునేలా చేసినట్లయింది. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి చేయాలనుకునే తల్లి దండ్రులకు చాలా ఇబ్బందిగా మారింది.
ఇక గత నెల కిందటి వరకు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టినా, పోయిన వారం రోజుల వ్యవధిలో బంగారం రేటు ఆకాశాన్ని దాటేసింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఏకంగా (1,29,930) లక్షా ఇరవైతొమ్మిది వేల తొమ్మిది వందలు పలుకుతుంది. ఇక ముప్పై దాటడమే లాంఛనం అయింది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే వెండి ధరలు కూడా బాగానే పెరుగుతున్నాయి.
