బాలీవుడ్ లో ఈ ఇయర్ హిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలే ఎక్కువ ప్రభావితం చేసాయి. అవి ఇండస్ట్రీని ఆర్ధికంగా ఎంతగానో కుదిపేశాయి. ముఖ్యంగా ఖాన్ త్రయాలు నటించిన ఎలాంటి సినిమాలైనా రిజెక్ట్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. ఇంకా చెప్పాలంటే చిన్న సినిమాలే ఒకింత నయం అని చెప్పొచ్చు. “చ్చావా” బాలీవుడ్ లో మరో సరైన బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు దురంధర్ రూపంలో అదిరిపోయే మాస్ సినిమా దక్కిందని అంటున్నారు సినీ క్రిటిక్స్. గత వీకెండ్ డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా బాలీవుడ్ లో భారీ వసూళ్లు రాబడుతుంది.
రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ గా నటించగా, సినిమాలో కొన్ని రియలిస్టిక్ సన్నివేశాలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక విలన్ గా అక్షయ్ ఖన్నా అప్పీరెన్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక దురంధర్ సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 160 కోట్లకి పైగా వసూలు చేయగా, మొదటివారం ముగిసే సరికి మూడు వందల కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అనిపిస్తుంది. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
ఇక రణ్వీర్ సింగ్ కూడా గత “సింబ” తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేక తన స్టార్ డమ్ పై ఎన్నో విమర్శలు ఎదుర్కోగా, దురంధర్ తో విమర్శకుల అభిప్రాయాలకు చెక్ పెట్టాడని చెప్పాలి. ఇక బాలీవుడ్ లో ఈ ఇయర్ చావా, సైయారా సినిమాల తర్వాత 500 కోట్ల సినిమాగా దురంధర్ నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
