టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రాబోయే క్రేజీ సినిమాల్లో “మన శంకర వర ప్రసాద్” కూడా ఒకటి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, సాంగ్స్ మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. మీసాల పిల్ల సాంగ్ వంద మిలియన్ వ్యూస్ కి చేరువ అవుతుండగా, తాజాగా రిలీజ్ అయిన శశిరేఖా సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ఇక అనిల్ రావిపూడి సినిమాలు కాస్త రొటీన్ గా అనిపించినా, సంక్రాంతి పండగకు థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలాగైనా మెప్పిస్తాడన్న పేరుంది. అందుకే ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. ఇదిలా ఉండగా “మన శంకర వరప్రసాద్” లో విక్టరీ వెంకటేష్ ఓ కీ రోల్ లో గెస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వెంకటేష్ రోల్ పై దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమాలో వెంకటేష్ దాదాపు 20 నిమిషాలు ఉండే అవకాశం ఉందని, పైగా వెంకటేష్ సినిమాలో ఓ సాంగ్ లో కూడా చిరుతో పాటు అలరిస్తారని అనిల్ రావిపూడి చెప్పారు. అలాగే చిరంజీవితో పాటు క్లైమాక్స్ సీన్స్ కూడా ఇరు హీరోల అభిమానులను బాగా అలరిస్తాయని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. మొత్తానికి చిరంజీవి, వెంకటేష్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఐ ఫీస్ట్ గా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాతో చిరంజీవి మరోసారి వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
