తెలంగాణాలో వచ్చే ఏడాది అనగా 2025 – 26 సంవత్సరానికి గాను పదో తరగతికి సంబంధించిన పబ్లిక్ పరీక్షల బోర్డు ఎక్జామ్ టైం టేబుల్ తాజాగా విడుదలైంది. ఈరోజు అనగా డిసెంబర్ న తెలంగాణ బోర్డు ప్రెస్ కి రిలీజ్ చేసారు విద్యా శాఖ అధికారులు. ఇక విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం 2026 మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు ఈ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలుస్తుంది. ఇక తొలుత ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్న విషయం తెలిసిందే. తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 13 వరకు జరుగుతాయి.
ఇక ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత మార్చి 14 నుండి “పదో తరగతి పరీక్షలు” నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులు నిర్ణయించడం జరిగింది. ఇక ప్రతీ పరీక్ష కూడా ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా ప్రతీ పరీక్షకు ఇక పండగల వలన ఏకంగా నాలుగు రోజుల గ్యాప్ రావడం విశేషం. అయితే పండుగల మధ్య ఇలా మూడు నాలుగు రోజులు గ్యాప్ రావడం వలన విద్యార్థులకు కూడా చదువుల ఒత్తిడి కాస్త తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
