టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబోలకు తెగ క్రేజ్ ఉంటుంది. అభిమానులు వాళ్ళ కాంబినేషన్ లో సినిమాలు రావాలని ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తారు. మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న అలాంటి క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్ అయింది. టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా మొదలైపోయింది. వీళ్ళ కలయికలో ఒక సినిమా రావాలని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అలాగే మూవీ లవర్స్ ఎంతో వెయిట్ చేసారు. ఎందుకంటే సెంటిమెంట్ అయినా, ఫన్ అయినా, ఎమోషనల్ అయినా త్రివిక్రమ్ రచనకి వెంకటేష్ నటన ఏమాత్రం తీసిపోదు.
గత రెండేళ్లుగా వీరి కాంబోలో సినిమా ఉందని ఆల్మోస్ట్ కంఫర్మ్ అని వార్తలు రాగా, నేడు ఫైనల్ గా పట్టాలెక్కింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతకు ముందు కూడా వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వెంకీ – త్రివిక్రమ్ కాంబో మొదలవడమే కాకుండా, టైటిల్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేసేసారు మేకర్స్.
ఇక వెంకీ – త్రివిక్రమ్ కాంబో సినిమాకి “ఆదర్శ కుటుంబం” అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా, పక్కా ఒక ఫ్యామిలీ సినిమా అంటూ హింట్ ఇచ్చేసారు. అలాగే సబ్ టైటిల్ లాగా ఈ టైటిల్ లోనే హోమ్ నెంబర్ 47, ఏకే 47 హైలెట్ చేసేసారు. అలాగే రిలీజ్ చేసిన వెంకటేష్ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. కళ్ళజోడు పెట్టుకుని చేతిలో బ్యాగ్ పట్టుకుని మంచి స్మైల్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. అంతే కాదు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, “హారికా & హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.
