Winter Season Best Helathy soups

శీతాకాలంలో ఈ హెల్తి సూప్స్ తీసుకోండి.. మీ ఆరోగ్యం మీ చెంతే

ఈ ఇయర్ శీతాకాలం గత కొన్నేళ్ల ముందు కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో చలి తీవ్రత మరీ ఎక్కువైంది. గత పదేళ్లలో ఈ స్థాయిలో చలి లేదని నిపుణులు అంటున్నారు. ఇక వృద్ధులు, చిన్న పిల్లలు రాత్రి ఏడు దాటిన తర్వాత అవసరం ఉంటే తప్ప బయట తిరగకపోవడం మంచిదని అంటున్నారు. అలాగే ఆహార అలవాట్ల విషయంలో కూడా ఏం తీసుకున్నా సాధ్యమైనంత వరకు వేడిగా తీసుకోవడం మంచిది. అయితే ఉదయం, సాయంత్రం వేళల్లో వేడిగా ఈ హెల్ది సూప్ లు తీసుకుంటే ఆరోగ్యం మీ చెంత ఉన్నట్టే.

పాలకూర సూప్ శీతాకాలంలో పాలకూర నీళ్ళల్లో వేసి వెల్లుల్లి మిరియాల పొడి, కొద్దిగా శనగపిండితో చేసే ఈ సూప్ పిల్లలకు చాలా మంచిది. దగ్గు నుండి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది.

దాల్ సూప్ : పెసరపప్పు, మినప్పప్పు తో పాటు పలురకాల పప్పు దినుసులతో ఈ సూప్ చేస్తారు. వెల్లుల్లి, అల్లం మిరియాలతో కలిసి చేసే ఈ సూప్ వొంట్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రాగి సూప్ : రాగి సూప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్నే రాగి జావ అని కూడా పిలుస్తారు. ఈ రాగి జావలో కొంచెం వెల్లుల్లి, మిరియాల పొడి వేసుకుని తాగితే దగ్గు, జలుబు లాంటి సమస్యలు దూరమవడమే కాకుండా శరీరానికి ఐరన్ కూడా ఇస్తుంది. అలాగే జొన్న జావ కూడా శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.

నాన్ వెజ్ సూప్స్ : ఇక మాంసాహార ప్రియులకు అల్లం, వెల్లుల్లి ముక్కలతో కలిపి చేసే చికెన్ సూప్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల ఫ్లూ జ్వరం కూడా తగ్గుతుంది. అలాగే మటన్ పాయా సూప్ కీళ్ల నొప్పులు ఉన్నవాళ్ళకి ఔషధంగా పని చేస్తుంది.