Chikiri song cross 100 million views in telugu

మరోసారి “చికిరి” రికార్డు.. అటు ఇటు కూడా

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో “పెద్ది” ఒకటి. ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా అది భారీగా ట్రెండ్ అవుతుంది. ఆ మధ్య టీజర్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయిందో తెలిసిందే. టీజర్ లో బ్యాట్ తో బంతిని కొట్టే సీన్ ని ఐపీఎల్ టీమ్ లు కూడా బాగా వాడుకున్నాయి. ఇక నెలన్నర కిందట రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ కూడా భీభత్సంగా హిట్ అయింది. రిలీజ్ అయిన రోజు నుండి మిలియన్ల కొద్దీ వ్యూస్ తో నెట్టింట హుంగామా చేయగా, తాజాగా చికిరి మరో అరుదైన రికార్డు అందుకుంది.

రెండు వారాల కిందటే చికిరి సాంగ్ అన్ని భాషల్లోనూ కలిపి వంద మిలియన్ల వ్యూస్ ని అందుకోగా, తాజాగా మళ్ళీ ఓ సాలిడ్ రికార్డ్ అందుకుంది. కేవలం తెలుగు వెర్షన్ లోనే చికిరి సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ ని అందుకోగా, 1.1 మిలియన్ లైక్స్ కూడా సాధించడం విశేషం. అంతే కాదు అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రెండు వందల మిలియన్ల వ్యూస్ ని దాటే దిశగా దూసుకుపోతుంది.

ఇక పెద్ది నుండి రెండో పాటని క్రిస్మస్ టైం లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తుండగా, పెద్దిని మార్చి 27 న రిలీజ్ చేయడానికి సినిమాని వేగంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు 65 శాతం సినిమా పూర్తవగా, నెక్స్ట్ షెడ్యూల్ ని ఢిల్లీ లో షూట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.