హైదరాబాద్ మహానగరంలో మరో భారీ స్కాం బయటపడింది. భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. “ఫ్రీ లాంచ్ ఆఫర్” (Free launch offer scam) అనే పేరుతో ఎంతో మందిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయగా, దానికి సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది. హైదరాబాద్ లో పలు ఏరియాల్లో ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో తక్కువ ధరలకు ఇల్లు, ఫ్లాట్స్ ఇప్పిస్తామని “జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ “కాకర్ల శ్రీనివాస్” (Kakarla Srinivas) ఎంతో మంది దగ్గర కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది.
ఈ ఫ్రీ లాంఛ్ ముసుగులో కొన్ని వందల మంది గృహ కొనుగోలుదారులు మోసపోయారు. ఫైనల్ గా ఈ రకమైన ల్యాండ్ మోసానికి పాల్పడిన ‘జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (Jayatri infrastructure pvt ltd) సంస్థపై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డిపార్ట్మెంట్ ఫైల్ ఓపెన్ చేయగా, ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఇక ఈ కేసులో ప్రధాన పాత్రధారి అయిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ ను ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేసారు.
గత కొన్ని రోజుల కిందట ఫ్రీ లాంచ్ పేరుతో మోసపోయిన కొనుగోలుదారులు పోలీస్ స్టేషన్లలో చేసిన ఫిర్యాదుతో, దర్యాప్తులో భాగంగా, పనులు వేగవంతం చేసి, పరారీలో ఉన్న నిందితుడు కాకర్ల శ్రీనివాస్ ని చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. ఇక తాజాగా చేసిన ఇన్వెస్టిగేషన్ లో శ్రీనివాస్ ఇప్పటివరకు 300 కోట్ల వరకు స్కాం చేసినట్టు ఈడీ అధికారులు అంచనా వేయగా, అంతకన్నా ఎక్కువ కూడా జరిగి ఉండవచ్చని సమాచారం. అయితే ఇంతకు ముందే హైదరాబాద్ పోలీసులు కాకర్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేయగా, అతడు బెయిల్ ప బయటికి వచ్చి పరారయ్యాడు. ఆ తర్వాత తాజాగా మళ్ళీ “మనీ లాండరింగ్ నిరోధక చట్టం” (పీఎంఎల్ఏ) కేసు కింద పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. ఇక ఈ కేసుపై మరింత సమాచారం కోర్టు నుండి రావాలి.
