బంగ్లాదేశ్ (Bangladesh) లో రోజురోజుకి మానవత్వం మంటగలిసిపోతుంది. ఇంకా చెప్పాలంటే మత విద్వేషాలతో దేశం మొత్తం నాశనమైపోతుంది. దాదాపు పదేళ్లుగా శాంతి భద్రతలు లోపించి, ఆర్ధికంగా పతనమైపోతున్న బంగ్లాదేశ్ గత ఏడాదికిందట, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా (Shaik hasina) ఇండియాకి పారిపోయి రావడంతో పీక్స్ కి చేరింది. అక్కడి నుండి బంగ్లాదేశ్ ఆర్మీ కూడా తమ పట్టును కోల్పోవడంతో అక్కడ ప్రజల తిరుగుబాటు మొదలైంది. ముఖ్యంగా ముస్లిం వర్గాలు రోడ్లపై అల్లరి చేస్తూ మైనార్టీలైన హిందూ, క్రిస్టియన్, బౌద్ధులను రోజుకో విధంగా వేధించడం మొదలుపెట్టారు. గత ఆరు నెలల కిందటే ఓ హిందూ మహిళను బుర్ఖా వేసుకోలేదని అవమానించిన వీడియో, అలాగే ఓ పల్లెటూరిలో గుడి కూల్చిన వీడియోలు వైరల్ అయ్యాయి.
అలాంటి ఘటనలు ఇప్పుడు బంగ్లాలో రోజుకోచోట జరుగుతున్నాయని, బంగ్లా మైనార్టీ హిందువులు సాయం కోసం సోషల్ మీడియా సాయంతో ఇతర దేశాలను వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరో అమానుష వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూస్తే అసలు బంగ్లాదేశ్ లో హిందువులు బతికే ఉన్నారా? ప్రభుత్వమే టెర్రరిస్ట్ లుగా ప్రవర్తిస్తున్నారా అనే అనుమానం రాక మానదు. వివరాల్లోకి వెళితే అల్లా పై దైవదూషణ చేశాడన్న ఆరోపణలతో “దీపు చంద్రదాస్” (Deepu chandradas) అనే హిందూ యువకుడిని ఇతర మతానికి చెందిన అల్లరి మూకలు కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో మైమన్ సింగ్ జిల్లా “భలుకా” ప్రాంతంలో జరిగింది.
ఈ అమానుష దారుణ ఘటనపై వీడియోలు సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. భలుకా స్థానిక ప్రాంతంలో గార్మెంట్ ఫ్యాక్టరీ లో పనిచేస్తున్న దీపు చంద్రదాస్ ని గురువారం రాత్రి “మహమ్మద్ ప్రవక్త” ను అవమానించాడన్న నెపంతో ఒక్కసారిగా కొన్ని వందల మంది గుంపు చుట్టుముట్టి చేతులతో, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసారు. అనంతరం చెట్టుకి ఉరివేసి వేలాడదీసి పెట్రోల్ పెట్టి తగలబెట్టారు. అయితే బంగ్లా పోలీసులు తమ జోక్యం లేకుండానే అతడిని హత్య చేసి, శవానికి నిప్పు పెట్టినట్లు ధృవీకరించారు.
ఈ ఘటనతో బంగ్లాదేశ్ లోనే కాకుండా భారత్ లో ప్రకంపనలు జరిగేలా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ బోర్డర్ లో ఉన్న భారత్ యొక్క పశ్చిమ బెంగాల్ లో ఎక్కువ హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇండియా వ్యాప్తంగా ఇప్పటికే పలు రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. పరిస్థితి చూస్తుంటే త్వరలో ఐక్యరాజ్యసమితి వరకు ఈ ఘటన ప్రభావం చూపే పరిస్థితి కన్పిస్తుంది. ఇటు బంగ్లా మైనార్టీ ప్రజలు కూడా భారత్ తమను ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. మరి ఈ అమానుష ఘటనపై భారత కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
