Bigg boss season 9 winner Controversy

BiggBoss Season 9 : బిగ్ బాస్ 9 విజేతగా సామాన్యుడు కళ్యాణ్.. అయినా నెటిజన్ల అసంతృప్తి?

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 9 (Bigg boss season9) గత సీజన్ల కంటే భీభత్సంగా హిట్ అవడంతో ఫైనల్ రోజున ఎవరు కప్ అందుకుంటారో అని తెలుగు ప్రేక్షకులందరూ ఎదురుచూడగా, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కళ్యాణ్ (Pawan Padala) బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలిచాడు. ఒక సామాన్యుడు మూడో వారంలో ఎలిమినేట్ అయ్యే స్థాయి నుండి కప్ కొట్టే స్థాయివరకు రావడం అభినందనీయం అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎపిసోడ్ పూర్తయిన రాత్రి నుండి తెలుగు ప్రేక్షకుల్లో మెజారిటీ వారి నుండి ఒకరకమైన అసంతృప్తి కనిపిస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రారంభం ముందు నుండి కప్ మాత్రం తనూజ (Tanuja), ఇమ్మాన్యుయేల్ (Emmanuel) మధ్యే ఎవరో ఒకరు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. సీజన్ స్టార్ట్ అయ్యాక కూడా బిగ్ బాస్ సీజన్ 9 ని ఫ్యామిలీ వీక్ వరకూ వీళ్లిద్దరి తమ కంటెంట్ తో ముందుకు తీసుకెళ్లారు. తనూజ తన పదునైన మాటలతో, ఆటలతో ఆకట్టుకోగా, ఇమ్మాన్యుయేల్ తన ఆటతో పాటు, అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.

ఇక కామనర్స్ గా ఎంట్రీ ఇచ్చిన డెమోన్ పవన్ (Demon Pawan) , కళ్యాణ్ కూడా తమ ఆటతీరుతో ఫిజికల్ టాస్కుల్లోనూ, ఇతర ఎంటర్టైన్మెంట్ టాస్కుల్లోనూ అదరగొట్టారు. ఫలితంగా టాప్ 5 కి చేరుకున్నారు. అయితే సోషల్ మీడియాలో ముందు నుండి ఉన్న విమర్శలు, కళ్యాణ్ ని విజేతగా ప్రకటించడంతో ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. అవేంటంటే ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలు ఎంత బాగా ప్రతిభ కనబర్చినా, ఫైనల్ కి వచ్చినా కప్ కొట్టలేకపోయారు. 9 సీజన్లలో కూడా అమ్మాయిలకు కప్ ఇవ్వలేదని, కొన్నింటిలో అర్హత ఉన్నా కూడా అన్యాయం చేసారని అన్నారు. గీతామాధురి, శ్రీముఖి, ఐశ్వర్య జైన్… ఇప్పుడు మళ్ళీ తనూజ కి అన్యాయం చేసారని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

అలాగే 9 సీజన్లలో కూడా కమెడియన్లు టాప్ కి రావడం అరుదు. కానీ ఇంతకు ముందు అవినాష్ సీజన్ 8 లో టాప్ ఫైవ్ లో ఒకడిగా నిలవగా, కప్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ ఆ లోటు తీరుస్తాడని బిగ్ బాస్ ఆడియన్స్ చాలామంది భావించినా అది జరగలేదు. టాప్ 4 గా బయటికి వచ్చాడు. ఈవిధంగా తనూజ, ఇమ్మాన్యుయేల్ సపోర్టర్స్ వాళ్లకి అన్యాయం జరిగిందని నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ తో సమంగా అన్ని ఆటల్లోనూ నిలిచిన డెమోన్ పవన్ కి కూడా అన్యాయం జరిగిందని విమర్శలు వస్తున్నాయి.

ఫైనల్ గా గత సీజన్ 7 లో రైతు బిడ్డ సెంటిమెంట్ తో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అవగా, అప్పుడు పల్లవి ప్రశాంత్ ని ఎంత ట్రోల్ చేసారో, బయటికి వచ్చాక ఎంత అతి చేసి జనాల్లో లోకువ అయ్యాడో తెలిసిందే. అలాగే ఈ సీజన్ 9 లో జవాన్ అంటూ కళ్యాణ్ సెంటిమెంట్ తో కప్ తీసుకున్నాడని, అలాగే ట్రోల్ అవుతాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ ట్రేడ్ విశ్లేషకులు మాత్రం కళ్యాణ్ కూడా కప్ కొట్టడానికి అర్హుడని, ఆర్మీ సెంటిమెంట్ ని పక్కనబెట్టి ఆలోచిస్తే, తన ఆటతీరుతో ప్రేక్షకుల్ని మెప్పించాడని అంటున్నారు. మరి వచ్చే సీజన్లో అయినా ఒక మహిళ బిగ్ బాస్ విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి.