భారత క్రికెట్ జట్టు కొత్త ఉత్సాహంతో వచ్చే వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ కోల్పోయిన బాధను అభిమానులకు మర్చిపోయేలా చేసి 2026 లో T20 కప్ ని గెలిచి క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపేలా చేయాలని ఇండియన్ క్రికెట్ టీమ్ ఆతృతతో ఉంది. ఇక T20 ప్రపంచ కప్ కోసం భారత్ (India) – శ్రీలంక (Srilanka) సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఐసీసీ T20 వరల్డ్ కప్ కి సంబంధించి కొత్త భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాగా రాబోయే ఈ T20 టోర్నీలో యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. T20 కెప్టెన్ గా “సూర్యకుమార్ యాదవ్” సారథ్యంలో మ్యాచులు జరగనుండగా, ఒక్కసారి 2026 T20 వరల్డ్ కప్ (T20 world cup 2026) కి ఎంపికైన ఆటగాళ్లను జాబితాను పరిశీలిద్దాం.
అభిషేక్ శర్మ (Abhishek sharma), ఇషాన్ కిషన్ (Ishan kishan) ఓపెనర్లుగా, మిడిల్ ఆర్డర్ గా సూర్యకుమార్ యాదవ్(Surya kumar yadav), తిలక్ వర్మ(Tilak varma), వికెట్ కీపర్లుగా అలాగే ఫినిషర్స్ గా సంజూ శాంసన్ (Sanju Samsan), హార్దిక్ పాండ్యా(Harthik pandya), రింకూ సింగ్(Rinku singh) ఆడనున్నారు. ఆరో స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫినిషర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అలాగే అక్షర్ పటేల్(Akshar patel), కుల్దీప్ యాదవ్(Kuldeep yadav), స్పిన్నర్లుగా తమ బలం చూపించనున్నారు. ఇక పిచ్ పరిస్థితులను బట్టి వరుణ్ చక్రవర్తిని(Varun chakravarthy) కూడా తీసుకోవచ్చు. అలాగే పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా(Jaspreeth bumrah), అర్ష్దీప్ సింగ్ (Harshadeep singh) తో పాటు, హర్షిత్ రాణా(Harshith rana), శివం దూబే (Shivam dubey) లు కూడా ఆడనున్నారు.
అయితే ఫామ్ లో లేకపోవడం వల్ల శుభ్ మన్ గిల్ ని తీసుకోకపోవడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. మరి 2026 లో T20 ప్రపంచ కప్ భారత క్రికెట్ అభిమానులకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో చూడాలి. ఇక ఈ T20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7న మొదలుకానుంది.
