నిండు గర్భిణి మహిళపై దాడి చేసినందుకు ఓ యువకుడికి పోలీసులు తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఈ ఘటన మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ లో అనంతపురం, సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Ys Jagan) బర్త్ డే సందర్భంగా సత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారి పల్లెలో కొందరు వ్యక్తులు కేక్ కట్ చేసి, బాణా సంచా కాల్చుతున్నారు. ఈ క్రమంలో సంధ్యారాణి అనే గర్భిణి అభ్యంతరం చెప్పగా, ఆ గొడవలో గర్భిణి అయిన సంధ్యారాణిపై అజయ్ దేవా అనే వ్యక్తి దాడి చేసి, ఆమె కడుపుపై తన్నినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు సంధ్యారాణి పై దాడి దాడి చేసిన నిందితుడిని తక్షణమే అరెస్టు చేసారు. అలాగే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నిందితుడు అజయ్ దేవా (Ajay deva)ను అరెస్టు చేశారు పోలీసులు. ఇక ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, బాధితురాలు సంధ్యారాణి (Sandhya rani) వెంటనే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. కానీ నిందితుడు అజయ్ రెండు రోజులుగా పరారీ అయ్యాడు. అయినా పోలీసులు పట్టువదలకుండా వెతికి పెట్టుకుని అరెస్ట్ చేసారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని పోలీసువారు తమ స్టయిల్లో ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోలీసులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
