హైదరాబాద్ (Hyderabad) లో మళ్ళీ డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. మొన్నటివరకు సెలెబ్రిటీల వైపు, అలాగే రాజకీయ ప్రముఖుల ఫ్యామిలీల వైపు కన్నేసిన పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు సిటీలో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీల పైన దృష్టి సారించారు. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో ఉన్న కొందరు ఎంప్లాయ్ లు ఈ కేసుల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. దీనికి సంబంధించిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన సుష్మిత (Sushmitha) అనే అమ్మాయి తాజాగా డ్రగ్స్ అమ్ముతున్నట్టు తెలుసుకుని పోలీసులు పట్టుకున్నారు. చిక్కడపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తున్న సుష్మిత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ డ్రగ్స్ దందాను విక్రయిస్తుందని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో పోలీసువారు సుష్మితతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ సహా, మరో నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే వీరి వద్ద నుండి ఎండిఎంఏ (MDMA), LSD బాటిల్స్, OG కుష్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం 4 లక్షల విలువచేసే డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియచేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
