Cm Revanth Reddy Sensational comments on KCR

Revanth Reddy : మాజీ సీఎం పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణాలో మళ్ళీ రాజకీయ రగడ స్టార్ట్ అయింది. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress), బిఆర్ఎస్ (BRS) పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. గత కొన్ని నెలలుగా అనారోగ్య కారణాల రీత్యా ఇంటికే పరిమితమైన “కెసిఆర్” (KCR) ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నారు. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఉద్దేశిస్తూ, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసారు. అయితే ఈరోజు తాజాగా జరిగిన కాంగ్రెస్ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) తో సహా బిఆర్ఎస్ నాయకులకి కౌంటర్లు వేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు (K.chandrasekhar rao) పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పై కాస్త దిగజారి మాట్లాడారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కేసీఆర్ ని ఉద్దేశిస్తూ, తాను ప్రమాస్వీకారం చేసిన రోజే కేసీఆర్ నడుము ఇరిగింది, అదే ఆయనకు పెద్ద శిక్ష అంటూ నోరుపారేసుకున్నాడు. అలాగే ఆయన తన ఫామ్ హౌసునే జైలు లాగా చేసుకుని, చుట్టూ తన పోలీసులనే కాపలా పెట్టుకున్నాడని, చర్లపల్లి, చంచల్ గూడ పోయినా అదే జరుగుతుంది గదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కేటీఆర్ (KTR) ని సైతం విమర్శిస్తూ, ..”నీ అవ్వ లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డా.. అంటూ, కేసీఆర్ నువ్వు బర్లు కాసుకో… అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసారు.

అలాగే త్వరలో కాంగ్రెస్ చేపట్టబోయే ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు నూతన సంవత్సరంలో ప్రజలకు ఇచ్చే బాధ్యత నాది అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే గ్రామాల్లో ప్రతీ ఇంటికి ఇప్పటికీ కొంతమందికి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు దగ్గరుండి ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇక బిఆర్ఎస్ కి కౌంటర్ గా రాబోయే 2029 ఎన్నికల్లో 100కి పైగా సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.