Wife Illigal Affire and murderd to husband

Achampeta : గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ప్రియుడికోసం భర్తను చంపిన భార్య..

ఈ జెనరేషన్ లో వివాహ బంధంపై ప్రజలు పట్టు కోల్పోతున్నారన్నది వాస్తవం. కానీ రోజూ జరుగుతున్న ఇన్సిడెంట్లు, మరియు వస్తున్న వార్తలను చూస్తుంటే ఒక్కోసారి ఇప్పటి యువతీయువకులకు పెళ్లి అంటేనే భయం వేస్తుందని చెప్పాలి. తాజాగా జరిగిన సంఘటన అలాంటి భయాన్నే కల్పిస్తుంది. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ మహిళ చేయరాని ఘాతుకం చేసింది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా, దానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసిన ఘటన నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా అచ్చంపేట(Achampet) పట్టణంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే అచ్చంపేట మండలంలో మారుతి నగర్ కాలనీ లో నివాసం ఉండే భార్యా భర్తలు లక్ష్మణ్ నాయక్ (Laman naik) (38) పద్మ (Padma) (30). అయితే గత నెల 25న లక్ష్మణ్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఓ సమయంలో అన్న భార్య పద్మ పై అనుమానం వచ్చి అతని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. నిందితురాలు పద్మని తమ శైలిలో పోలీసులు విచారణ చేయగా, నిజాన్ని ఒప్పుకుంది.

ఘటన గురించి పోలీసుల కథనం ప్రకారం… అచ్చంపేటకి చెందిన పద్మ 2024 లో డీఎస్సీలో ఉపాధ్యాయ వృత్తికి ఎంపికైంది, ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఏడాదిగా ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. ఈ క్రమంలో నిందితురాలు పద్మకు, తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న రాత్లావత్ గోపి (Gopi) అనే ఉపాధ్యాయుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యి, భార్య పద్మ, ప్రియుడు గోపి తో కలిసి గత నెల 24న రాత్రి పడుకొని ఉన్న భర్త లక్ష్మణ్ నాయక్ ముక్కు మరియు నోటిఫై గుడ్డతో మూసి ఊపిరాడకుండా చంపేశారు.

తర్వాతి రోజు ఏమి ఎరగనట్టు పాఠశాలకు వెళ్ళి, ఇంటి యజమానికి ఫోన్ చేసి, తన భర్త ఎంత ఫోన్ చేసినా ఎత్తడం లేదని, తనకు భయంగా ఉందని ఆందోళన పడుతున్నట్టు నటించింది పద్మ. ఆమె ఇంటికి రాగానే ఇంట్లో భర్త చనిపోయి ఉన్నాడని పద్మ అందర్నీ నమ్మించగా, అన్న మృత దేహాన్ని, అలాగే అతని భార్య ప్రవర్తన చూసి పోలీసులకు ఫిర్యాదు చేసాడు మృతుడు లక్ష్మణ్ నాయక్ తమ్ముడు. ఇటు పోలీసులు తమదైన శైలిలో పద్మ, గోపిలను విచారణ జరిపి, వివాహేతర సంబంధం వల్లే హత్య జరిగిందని వాస్తవాలు రాబట్టి, వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.