నేటి యువతరంలో ఎంతో మంది విద్యార్థులు పలు వ్యసనాలకు బానిసలై, ఒత్తిడితో కెరీర్ ని ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్న ఈరోజుల్లో, ఒక విద్యార్థి ఏకంగా 2.5 కోట్ల ప్యాకేజి గల ఉద్యోగాన్ని సంపాదించి ఇండియా వైడ్ గా సెన్సేషన్ గా మారాడు. అది కూడా హైదరాబాద్ కుర్రాడు కావడం విశేషం. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Hyderabad) కి చెందిన ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ (Edward Nathan Varghese) అనే విద్యార్థి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) చదువుతున్నాడు. 21 ఏళ్ల వయసున్న ఈ యువకుడు నెదర్లాండ్స్ కంపెనీ నుండి బంపర్ ఆఫర్ కొట్టేసాడు.
నెదర్లాండ్ దేశానికి చెందిన ఆప్టివర్ (Optiver) అనే గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ ఎడ్వర్డ్ కి ఈ జాబ్ ఆఫర్ ఇచ్చింది. కాగా హైదరాబాద్ IIT లో లాస్ట్ హైయెస్ట్ ప్యాకేజి 1.1 కోట్లు కాగా, డబుల్ తేడాతో 2.5 కోట్లతో ఎడ్వర్డ్ బద్దలు కొట్టేసాడు. ఇక 2026 జూలై నెలలో నెదర్లాండ్స్ లో ఆప్టివర్ ఆఫీసులో Software Engineer గా ఎడ్వర్డ్ జాయిన్ కానున్నాడు. అయితే ఎడ్వర్డ్ నాథన్ కి ఈ జాబ్ మాములుగా సాధారణ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో రాలేదు. ఎడ్వర్డ్ ఈ కంపెనీలో రెండు నెలలు సమ్మర్ ఇంటర్న్షిప్ పూర్తి చేసాడు. ఫలితంగా అతని పని తీరు నచ్చి కంపెనీ ‘Pre-Placement Offer’ (PPO) ఇచ్చింది. ఇంటర్న్షిప్ లో ఒక ప్రాజెక్టు ని అతి తక్కువ సమయంలో పూర్తి చేయడంతో ఈ జాబ్ సొంతం అయింది.
ఇక హైదరాబాద్‌లో పుట్టిన ఎడ్వర్డ్ నాథన్ 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు బెంగళూరులోనే చదువుకున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా ఇంజనీర్లే కావడంతో, ఫస్ట్ ఇయర్ నుంచే తనకు కోడింగ్ (Coding) మరియు ప్రోగ్రామింగ్స్ పై ఆసక్తి ఉండేదని ఎడ్వర్డ్ తెలిపాడు. “ఐఐటీ ట్యాగ్ మరియు ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్ తనకు చాలా హెల్ప్ అయ్యాయిని ఎడ్వర్డ్ చెప్పుకొచ్చాడు.
