School bus accident in khammam district

Telangana : బోల్తా పడిన స్కూల్ బస్సు… తప్పిన భారీ ప్రమాదం

వంద మందికి పైగా విధ్యార్ధులతో వెళ్తున్న స్కూల్ బస్సు తాజాగా ప్రమాదానికి గురయింది. అయితే భారీగా నష్టం జరిగే స్థితి నుంచి అదృష్టవశాత్తు పిల్లలు బయటపడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకోగా, దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణా (Telangana) లో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు (Ganesh padu) గ్రామ శివారులో ఈ ప్రమాదం జరుగగా, వేంసూరు మండలం “మొద్దులగూడెం” (Moddula gudem) గ్రామానికి చెందిన “శ్రీ వివేకానంద పాఠశాల” (Sri vivekananda school) స్కూల్ బస్సు లో దాదాపు 107 మంది విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు.

107 మంది స్కూల్ విద్యార్థులు బస్సులో ప్రయాణిస్తుండగా, గణేష్ పాడు గ్రామ శివారులో కాలువ దగ్గర బస్సు అకస్మాత్తుగా బోల్తా పడింది. అయితే కాలువలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పిందని చెప్పాలి. పరిమితికి మించి విద్యార్థులు బస్సులో ప్రయాణించడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేయగా, బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు చెప్తున్న కథనం ప్రకారం బస్సు డ్రైవర్ మద్యం తాగి బస్సు నడిపినట్టు సమాచారం. రోజు ఇలాగే మద్యం తాగి వస్తాడు అంటూ విద్యార్థులు ప్రమాదం నుంచి తప్పించుకుని ఏడుస్తూ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఘటనలో 40 మందికి పైగా విద్యార్థులు గాయాలపాలవగా, వారిని స్థానికులు వెంటనే రక్షించి ఆసుపత్రి కి తరలించారు. ఇక ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో బస్సు డ్రైవర్ కి కఠిన శిక్ష వేయాలని, స్కూల్ ని బ్యాన్ చేయాలని కామెంట్స్ వస్తున్నాయి.