టాలీవుడ్ నటుడు శివాజీ (Sivaji) తాజాగా నటించిన “దండోరా” (Dandora) చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్ విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్ గురించి, అలాగే సమాజంలో ప్రస్తుత ఆడవారి కట్టుబొట్టు గురించి మాట్లాడుతూ… “సంప్రదాయ దుస్తులు, చీరలు, మహిళల అందం – ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతాయని, చిన్న దుస్తులు ధరించడం తప్పు కాకపోయినా సమాజం చూసే తీరు వేరే అని, “సరైన” దుస్తులు ధరిస్తే సహజ ఆకర్షణ, శోభ స్వయంగా కనిపిస్తాయని శివాజీ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో రెండు పదాలు ఎక్కువ అనేసరికి సోషల్ మీడియాలో శివాజీ వ్యాఖ్యలు పాజిటివ్ అవ్వాల్సింది పోయి, నెగిటివిటీకి దారి తీశాయి.
అయితే ఈ వివాదం ఉదయం నుంచి పెరిగిపోగా, సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు శివాజీ చేసిన కామెంట్స్‌ను తప్పుబడుతున్నారు. ముఖ్యంగా యాంకర్ అనసూయ (Nanasuya) దొరికిందే అవకాశంగా శివాజీపై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. ఇదిలా ఉండగా శివాజీ చేసిన కామెంట్స్ పై “వాయిస్ ఆఫ్ ఉమెన్” తరఫున నిర్మాత సుప్రియ యార్లగడ్డ, డైరెక్టర్ నందిని రెడ్డి, స్వప్న దత్, ఝాన్సీ తదితరులు “మా” (Movie Artist Asociation) కు ఫిర్యాదు చేశారు. ఆడవారిని కించపరుస్తూ ఇలాంటి కామెంట్స్ చేస్తే ఉపేక్షించేది లేదని, నటుడు శివాజీ తక్షణమే మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
అయితే శివాజీ వెంటనే ల్యాగ్ చేయకుండా కాసేపటికిందే మహిళలకు, సోషల్ మీడియా తరపున క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. “మహిళల పట్ల తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని.. అయితే, కొందరు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడటం చూసిన తాను అలా మళ్ళీ జరగకూడదని వారి మంచి కోసమే.. ఆ కామెంట్స్ చేశానని.. అంటూ, కానీ తాను వాడిన ఒకటి రెండు పదాలు తప్పు అని.. అందుకే “మహిళలందరికీ తాను క్షమాపణలు కోరుతున్నానని” తెలిపారు. ఈ వివాదం పెద్దదవకముందే శివాజీ వీడియో రిలీజ్ చేసినందువల్ల ఈ ఇంతటితో ఈ వివాదానికి స్వస్తి చెప్పారని అనుకోవచ్చు.
