నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 సినిమా డిసెంబర్ 12న విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. విడుదలైన రోజున మిశ్రమ స్పందన తెచ్చుకున్నా టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. నందమూరి బాలయ్య మాస్ ఎలివేషన్స్ కి తోడు బోయపాటి శ్రీను టేకింగ్, డివోషనల్ అండ్ ఇండియన్ కల్చర్, అలాగే దేశానికి సంబంధించిన పలు అంశాలతో కంటెంట్ రెడీ చేసి ప్రేక్షకులకు ఒక మాస్ ఫీస్ట్ ని అందించారు మేకర్స్. అయితే అఖండ ని హిందీ ప్రేక్షకులకి అందివ్వలేకపోయిన మేకర్స్, ఈ రెండో పార్ట్ ని హిందీలో భారీగా రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ చేద్దామని అనుకున్నారు చిత్ర యూనిట్.
అందులో భాగంగా అఖండ 2 ఫస్ట్ లుక్ మొదలుకొని సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ కూడా హిందీలో భారీగా ప్రమోషన్స్ చేసారు. అంతే కాదు ఎప్పుడూ లేనట్టుగా బాలకృష్ణ స్వయంగా ముంబై వెళ్లి అఖండ 2 కోసం ప్రమోషన్స్ చేసారు. మీడియాతో పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. దీంతో అఖండ2 బాలీవుడ్ లో వంద కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అభిమానులు అనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత లెక్కలు మారిపోయాయి.
అఖండ2 హిందీలో క్రిటిక్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, ఆడియన్స్ నుండి కొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లకు ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పాలి. అఖండ తాండవం హిందీ వెర్షన్ మూడు రోజుల్లో ఇప్పటివరకు 40 లక్షల లోపే గ్రాస్ వసూలు చేసింది. కానీ మౌత్ టాక్ తో లాంగ్ రన్ లో ఆడే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. కానీ తెలుగు వెర్షన్ మాత్రం సాలిడ్ ఓపెనింగ్స్ తో బాలయ్య అదరగొట్టాడని చెప్పాలి. మూడు రోజుల్లో అఖండ వరల్డ్ వైడ్ గా 85 కోట్ల గ్రాస్ రాబట్టగా మొదటివారం ముగిసే సరికి 150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టొచ్చని అంచనా. మరి లాంగ్ రన్ లో అఖండ తాండవం ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
