AP Deputy CM Pawan kalyan at Delhi

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం

తెలుగు రాష్ట్రాల్లో సినీ రాజకీయ ప్రముఖులకు ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతలా ట్రోల్ చేస్తున్నారో తెలిసిందే. అయితే ఈ తంతు ఎప్పట్నుంచో ఉన్నది అనుకున్నా, ఈ మధ్య మరీ శృతి మించిపోయారు నెటిజన్లు. సినీ రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా వారి ఫ్యామిలీని సోషల్ మీడియా లోకి లాగి కించపరుస్తున్నారు. ఇప్పుడు ఈ సెగ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తాకింది. అందుకే దీని కోసం ఏకంగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాడు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా రంగంలో స్టార్ హీరోగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అంతే కాదు నేషనల్ వైడ్ గా ఫేమ్ ఉన్న సినీ పొలిటికల్ వ్యక్తి. అందువల్ల జనాల దృష్టి ఎక్కువగా ఉంది. అందుకే తన వ్యక్తిగత హక్కులను కాపాడాలని పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో తనపై జరుగుతున్న మార్ఫింగ్ లు ఎడిట్ చేసిన ఇమేజ్ లు ఇతర ఫైల్స్ లాంటివి వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసాడు. ఇక దీనిపై 48 గంటల్లో విచారణ జరిపి వాటికి సంబంధించిన లింక్స్ ని న్యాయస్థానంలో పొందుపరచాలని ఆదేశించారట.

ఇక ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున దీనిని సాయి దీపక్ అనే అడ్వకేట్ చూసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో వారం రోజుల్లో తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, తదుపరి విచారణ డిసెంబర్ 22న జరుగనుందట. ఇక ఇంతకు ముందు కూడా సీనియర్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో కించపరుస్తున్నారని కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.