తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో, మరియు సీరియళ్ళలో నటించి ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న (Jayavahini) నటి జయ వాహిని. గత కొంత కాలంగా సినిమాలకు దూరమైన ఈ నటి సడన్ గా ఆసుపత్రిలో చికిత్స కోసం దీనమైన పరిస్థితిలో కనిపిస్తూ అందరికి షాక్ ఇచ్చింది. బెడ్ పై లేవలేని పరిస్థితిలో ఉన్న ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1978లో జన్మించిన వాహిని, బుల్లితెర ప్రేక్షకులకు “జయ వాహిని” పేరుతో దగ్గరైంది. చిన్న చిన్న పాత్రలతో స్టార్ట్ చేసి, సీరియల్స్ లో ప్రతినాయకి పాత్రలతో పాపులర్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించింది.
అయితే గత కొంత కాలంగా నటి వాహిని రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుండగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి క్షీణించడంతో ప్రస్తుతం ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి (Karate Kalyani) వీడియో చేయడం వల్ల వాహిని గురించి అందరికి తెలిసింది.
కాగా ఇక డాక్టర్ల సమాచారం ప్రకారం ఐసియులో ఆమెకు నిరంతర చికిత్స అలాగే కీమోథెరపీ, సర్జరీలు కలిపి సుమారు 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలపడం జరిగింది. ఈ క్రమంలో వాహిని ఆసుపత్రి ఖర్చులకై చిత్ర పరిశ్రమ (Film industry) ఆదుకోవాలని కరాటే కళ్యాణి, అలాగే పలు జూనియర్ ఆర్టిస్ట్ లు కోరడం జరిగింది.
