balakrishna targeting to achive 100 cr club with akhanda2

బాలయ్య అభిమానుల కల ఆ రికార్డు.. ఈసారి కొట్టేలా ఉంది..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ హీరోగా నటించిన “అఖండ2 తాండవం” మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య కెరీర్ లో భారీ హైప్ తో రిలీజ్ అవుతున్న అఖండ2 ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ ఇంకా సాంగ్స్ తో అభిమానులను ఆకట్టుకోగా, ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాని రిలీజ్ చేస్తున్నాడు బాలయ్య. అయితే బాలకృష్ణ కి సంబంధించి నందమూరి అభిమానులకు కొన్నేళ్లగా ఓ రికార్డు కలగానే మిగులుతూ వస్తుంది. అదే వంద కోట్ల రికార్డు.. అవును టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో మార్కెట్ పరంగా ఇప్పటి స్టార్ హీరోలకు పోటీనిస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లలో వంద కోట్ల షేర్ ఇప్పటికే చిరంజీవికి మూడు సార్లు ఉంది.

చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం 150, సైరా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వంద కోట్ల షేర్ సాధించి రికార్డు సాధించాడు. అలాగే వెంకటేష్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం తో ఏకంగా 150 కోట్ల షేర్ సాధించి రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇక నాగార్జున తన వందో సినిమాతో ఈ రికార్డు కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. అయితే బాలకృష్ణ కు మాత్రం వంద కోట్ల క్లబ్ అనేది అందని ద్రాక్షగా తయారయింది.

బాలకృష్ణ నటించిన అఖండ తో మాస్ కం బ్యాక్ ఇవ్వగా, ఆ సినిమా వంద కోట్లు రాబడుతుందనుకున్నా, కుదరలేదు. ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లతో వరుస సక్సెస్ లు కొట్టినా అవి 80 కోట్ల షేర్ దగ్గరే ఆగిపోయాయి. కానీ ఈ సారి అఖండ2 భారీ హైప్ తో పాన్ ఇండియా భాషల్లో హిందీలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది, అందువల్ల అఖండ2 వంద కోట్ల షేర్ సాధించడం ఖాయమని నందమూరి అభిమానులు అంటున్నారు. హిందీలో గనుక మంచి టాక్ వస్తే 150 కోట్లకి పైగా షేర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని, ప్రస్తుతం ఉన్న హైప్ దృష్ట్యా మొదటివారమే వంద కోట్ల ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.