Chikiri chikiri song crosess 100 million views

సెంచరీ కొట్టేసిన చికిరి చికిరి..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “పెద్ది” సినిమా నుండి ఫస్ట్ సాంగ్ గా రిలీజ్ అయిన “చికిరి చికిరి” రిలీజ్ అయిన రోజు నుండే ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రొమాంటిక్ మెలోడీ ట్యూన్స్ తో రిలీజ్ అయిన ఈ సాంగ్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే చికిరి సాంగ్ సౌత్ లోనే 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన సాంగ్ గా రికార్డు కొట్టగా, హిందీలో కూడా సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక లేటెస్ట్ గా చికిరి సాంగ్ మరో రికార్డ్ కొట్టేసింది. పెద్ది సాంగ్ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేయగా, 1.6M లైక్స్ ని క్రాస్ చేసింది. ఇక ఒక్క తెలుగులోనే మిలియన్ లైక్స్ ఉండడం విశేషం. ఇక ఈ సాంగ్ ని బాలీవుడ్ సింగర్ మోహిత్ చౌహన్ తెలుగు, హిందీలో కలిపి పాడడం జరిగింది. పెద్ది నుండి రెండో సాంగ్ ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక పెద్ది సినిమా షూటింగ్ ఫినిషింగ్ దశకు చేరుకోగా, జనవరి నుండి ప్రమోషన్లలో స్పీడ్ పెంచనున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రహ్మాన్ చాలా ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ అల్బమ్ ఇచ్చారని మేకర్స్ అంటున్నారు. ఇక పెద్ది లో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటుంది. మరి కొన్ని రోజుల్లో పెద్ది తెలుగు వెర్షన్ ద్వారానే వంద మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసే ఛాన్స్ ఉంది.