Chikiri Chikiri Song making video wiral

చికిరి మేకింగ్ వీడియో వైరల్.. పాట వెనుక కష్టానికి ప్రతిఫలం!

మాములుగా ఒక సినిమా చిత్రీకరణ చేయడానికి మేకర్స్ ఎంత కష్టపడతారో సినిమా ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 24 క్రాఫ్ట్స్ లో అందరూ సహకరించి నటీనటులతో సహా ఎవరికీ వారు ఎంతో కష్టపడాలి. ఇక పెద్ద సినిమాలు అయితే ఈ మధ్య క్వాలిటీ ఉన్న సినిమాలు అందించాలని సంవత్సరాల కొద్దీ శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతారు. అయితే రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న “పెద్ది” సినిమాలో “చికిరి చికిరి” సాంగ్ రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తాజాగా 100 మిలియన్ల వ్యూస్ దాటేసిన ఈ పాట 150 మిలియన్ల వ్యూస్ దిశగా దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ చికిరి సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఎంత కష్టపడ్డారో ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి సప్రైజ్ చేసారు.

ఆ మేకింగ్ వీడియోతో పాట మొత్తాన్ని చాలా రియలిస్టిక్ గా రియల్ లొకేషన్లలో తెరకెక్కించారని తెలుస్తుంది. ఇక పాటలో కొన్ని బిట్స్ షూట్ చేయడానికి ఓ కొండ ఎక్కి దిగారని తెలుస్తుంది. అయితే ఆ కొండ పైకి వెళ్ళడానికి చిత్ర యూనిట్ కి దాదాపు 45 నిమిషాలకు పైగా సమయం పట్టిందట. ఆ వీడియోలో చిత్ర యూనిట్ తాళ్లు సెట్ చేసుకుని వాటికి పట్టుకుని నడుస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అందులో రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఉన్నారు.

ఇక ఈ మేకింగ్ వీడియోలో ఒక చోట బుచ్చిబాబు రామ్ చరణ్ గురించి చెప్తూ, “చిరుత” సినిమా టైమ్ లో థియేటర్లో మీ సాంగ్స్ కోసం వెయిట్ చేసి రెండేసి సార్లు థియేటర్లో ప్లే చేయించే వాళ్ళం, ఇప్పుడు మీతోనే సాంగ్ షూట్ చేసి సినిమా డైరెక్ట్ చేస్తున్నా అంటూ బుచ్చిబాబు ఆనందంగా ఎమోషనల్ అవుతాడు. ఇక ఈ పాట కోసం మేకర్స్ చాలా రిస్కీ లొకేషన్లలో షూట్ చేసారు. మహారాష్ట్రలో నాసిక్ దగ్గర, అలాగే పాటలో మరికొంత భాగం శ్రీలంకలో షూట్ చేసారు.