అఖండ2 వాయిదాతో బాలకృష్ణ అభిమానులు ఎంత అసహనానికి గురయ్యారో తెలిసిందే. అయితే నిర్మాతలు తమ సమస్యలన్నీ పరిష్కరించుకొని ఇప్పుడు డిసెంబర్ 12న అఖండ తాండవం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 12న రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలన్నీ మరో డేట్ ని వెతుక్కోవడానికి సిద్ధమవుతున్నాయి. అయితే టాలీవుడ్ లో మరో టాలెంటెడ్ దర్శకుడు తన సినిమా వాయిదా పడబోతుందని తెలిసి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. అతనెవరో కాదు కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్.
దర్శకుడు సందీప్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ తో పాపులర్ అయిన డైరెక్టర్ కలర్ ఫొటోతో దర్శకుడిగా పరిచయమై మంచి సక్సెస్ ని సొంతం చేసుకోవడమే కాకుండా, తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టేసాడు. ఇక ఆ తర్వాత కొన్ని చిత్రాలకు రైటర్ గా కూడా వర్క్ చేసిన సందీప్ రాజ్, సీతారామం, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో నటించాడు. ఇదిలా ఉండగా యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో “మోగ్లీ” అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రమోషన్లతో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కి రెడీ అవుతుండగా, వాయిదా పడ్డ అఖండ 2 ఇదే డేట్ కి వస్తుండడంతో మోగ్లీ రిలీజ్ డేట్ ని వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా దర్శకుడు సందీప్ రాజ్ తన బాధని వ్యక్తపరిచారు.
ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సందీప్ రాజ్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. “కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలకు బహుశా నా బదులుగా మరొక దర్శకుడు తీసుంటే బాగుండు అని ఇప్పుడు అనిపిస్తుంది”. నా రెండు సినిమాలు తమ వృత్తి, ఫ్యాషన్ కోసం ఏదైనా చేయగల ఉత్సాహవంతులైన వ్యక్తులచే రూపొందాయి. ఈ రెండు చిత్రాల మధ్య కామెన్ పాయింట్స్ కూడా ఇవే” అంటూ సందీప్ రాజ్ తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. సినిమాకి సంబంధించి ప్రతిదీ బాగానే జరుగుతున్నట్లు అనిపించినపుడు, వాటి రిలీజ్ ల విషయంలో ఊహించని ఆటంకాలు ఎదురయ్యాయని, అలాగే రెండో కారణంగా తనని తాను తగ్గించుకుంటూ, “రెండోది నేను.. అయితే నేనే దురదృష్టవంతుడినేమో..
“దర్శకత్వం: సందీప్ రాజ్” అనే టైటిల్ ను తాను థియేటర్లో చూడాలనే నా కల తనకు రోజురోజుకూ కష్టమవుతోందని” సందీప్ ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. అలాగే చిత్ర నిర్మాతలు, ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాతలైన SKN వంటి వారు సందీప్ రాజ్ కు సపోర్ట్ గా నిలుస్తూ ట్వీట్ వేస్తున్నారు. మరి ఫైనల్ గా డిసెంబర్ 12న అఖండ తాండవం వస్తుందా, లేక మోగ్లీ థియేటర్లో వస్తుందా అనేది చూడాలి.
