తెలుగు టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్ కన్నా ఆసక్తికరంగా సాగుతుంది. రెండు వారాల ముందు వరకు చప్పగా సాగిన ఈ సీజన్ గత వారం చివరి నుండి ఊపందుకుంది. రోజుకో గొడవతో నాగార్జున చెప్పినట్టు నిజంగానే రణరంగం గా మారుతుంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ 9 హౌస్ లో తాజాగా 12వ వారం నామినేషన్ల ప్రక్రియ జరగగా, ఈ నామినేషన్లలో భీభత్సమైన ఆర్గ్యుమెంట్లు జరిగాయని చెప్పవచ్చు. సుమన్ శెట్టి మొదలుకొని హౌస్ లో అందరూ తమదైన స్టైల్ లో రెచ్చిపోయారని చెప్పాలి.
అయితే ఈ నామినేషన్లో ఈసారి కొందరు హౌస్ మేట్స్ తమ హద్దు దాటి ప్రవర్తించారని చెప్పాలి. ఎంతలా అంటే తిట్టుకోవడం నుంచి మొదలెట్టి కొట్టుకునే పరిస్థితి వస్తుందనేలా జరిగింది. అయితే కారణాలేమైనా ఇందులో భాగంగా డెమోన్ పవన్ ఇమ్మాన్యుయేల్ ని నామినేట్ చేస్తున్న సమయంలో కళ్యాణ్ అనుకోకుండా మాట కలిపి దాన్ని పెద్దది చేయగా, ఒక్కసారిగా ఆవేశానికి లోనైన డెమోన్ కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు. వెంటనే ఇమ్మాన్యుయేల్, సంజన ఆపి పక్కకి లాక్కెళ్లారు. అయితే కళ్యాణ్ దాన్ని పెద్దది చేయలేదు. లేదంటే వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగేదని చెప్పాలి.
అలాగే కళ్యాణ్ కూడా ఈ వాదనలో భాగంగా బిగ్ బాస్ ప్రాపర్టీస్ ని తన్నడం, ఎత్తేయడం చేసాడు. ఇంతకు ముందు కూడా ఇలాగే చేయడం వల్ల బిగ్ బాస్ నుండి ఆగ్రహానికి గురి కావడం తప్పదనిపిస్తోంది. అంతే కాకుండా ఈ గొడవల్లో ఒకసారి నోరు జారాడు. అది బిగ్ బాస్ ఎపిసోడ్ లో మ్యూట్ చేసారు. కానీ దీని గురించి కూడా నాగ్ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాలి. ఇక వీళ్లిద్దరి కంటే పెద్ద తప్పు సంజన చేసిందని చెప్పాలి. నామినేషన్లో భాగంగా సంజన రీతుని నామినేట్ చేస్తూ గొడవ చేసింది. ఇందులో భాగంగా సంజన రీతుపై అరుస్తూ, నువ్వు డెమోన్ తో రాత్రి ఉండడం నచ్చలేదు అంటూ నోరుజారింది. ఇది సంజనకు చాలా పెద్ద మైనస్ అవుతుందని చెప్పడం లో సందేహం లేదు.
ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒకరికి తప్పకుండా నాగార్జున రెడ్ కార్డు చూపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది. అలాగే ఒకరు లేదా ఇద్దరికీ ఎల్లో కార్డు కూడా చూపించవచ్చు. ఏది ఏమైనా ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 9 టిఆర్పి రేటింగ్ కూడా దూసుకెళ్లడం ఖాయమని చెప్పాలి. మరి ఈ ముగ్గురిలో రెడ్ కార్డు ద్వారా ఎవర్నైనా బయటికి పంపిస్తారా? లేదా వార్నింగ్ ఇచ్చి ఆపుతారా అనేది తెలియాలి.
