Gift of gold ornaments worth Rs 4 crores to Lord Venkateswara

నీలోఫర్ అధినేత భారీ కానుక.. తిరుమలేశుడికి నాలుగు కోట్ల యజ్ఞోపవీతం..

దేశంలో ఉన్న హిందూ దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం వేలాది భక్తులకు దర్శనమిస్తూ ఎల్లప్పుడూ తన కరుణ చూపించే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈరోజు ఓ భక్తుడు ఒక భారీ కానుక సమర్పించి దేశం మొత్తం వార్తల్లో నిలిచాడు. అతనెవరో కాదు హైదరాబాద్ లో మహా పాపులర్ అయిన నిలోఫర్ కేఫ్ అధినేత బాబూరావ్.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లో చారిత్రక ప్రదేశాలతో పాటు ఎన్నో రకాల వ్యాపారాలకు, స్థలాలకు వ్యక్తులకు ఘనమైన పేరుంది. అలంటి పేరున్న వ్యక్తుల్లో నిలోఫర్ అధినేత బాబురావు ఒకరు. హైదరాబాద్ లో అయన ఏర్పాటు చేసిన నీలోఫర్ కెఫె లో టీ తాగాలంటే 100 నుండి 1000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అంతలా ఆయన టీ పాపులర్ అయింది. అయితే తాజాగా బాబురావు తిరుమల శ్రీవారికి ఓ భారీ కానుకని సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు.

తిరుమల శ్రీవారికి బాబురావు దాదాపు నాలుగు కోట్ల విలువైన యజ్ఞోపవీతాన్ని సమర్పించుకున్నాడు. శ్రీవారి దర్శనం చేసుకున్నాక ఆయన మాట్లాడుతూ ఓసారి బాబూరావుకు కలలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై తనకోసం యజ్ఞోపవీతం చేయించాలని ఆజ్ఞాపించినట్టు తెలిపారు. ఇక బాబురావు వెంటనే నాలుగున్నర కోట్ల రూపాయల ఖర్చుతో మెత్తని బంగారు తీగలతో, వజ్రాలు పొడిగించి నెలరోజుల్లో యజ్ఞోపవీతం తయారు చేయించి శ్రీవారికి సమ్పరించారు. ఇక బాబురావు తన భక్తితో దేవుడ్ని మాత్రమే కాదు, పలు సందర్భాల్లో ఎన్నో చోట్ల అన్నదానాలు చేయిస్తూ తన హుందాతనాన్ని చాటుకుంటున్నారు.