Gold rate today in india

తగ్గిన గోల్డ్ రేట్.. ఇదే కంటిన్యూ అవుతుందా?

ఇండియాలో బంగారానికి ప్రజలు ఎంత విలువ ఇస్తారో తెలిసిందే. ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా, ఫ్యామిలీ ఆశించే అతిపెద్ద బహుమతులలో బంగారమే ముందుంటుంది. అయితే గత రెండేళ్లలో బంగారం విలువ ఎంత పెరిగిపోయిందో తెలిసిందే. ప్రపంచ ఆర్ధిక గణాంకాల్లో ఇండియాకి సంబంధించి పరిస్థితులు ఏవైనా, ఏ వస్తువు విలువ పెరిగినా తగ్గినా ఒక్క బంగారం విషయంలో మాత్రం ఈ మధ్య కాలంలో భారీ మార్పులు జరిగాయి. కేవలం మూడేళ్ళలో బంగారం విలువ డబుల్ అయ్యిందంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా గత ఏడాది కాలంలో తులం బంగారానికి ఏకంగా యాభై వేలకు పెరిగి నెల కిందటి వరకు 130000 కి వచ్చి ఆగింది.

అయితే గత నెలన్నరగా బంగారం ధరల్లో దాదాపు పది వేల వరకు తేడా వచ్చింది. తాజాగా బంగారం ధర 10 గ్రాముల మీద 600 తగ్గింది. నిన్నటికి హైదరాబాద్ వంటి నగరాల్లో 10 గ్రాముల బంగారం 1,26,860 ఉండగా, తాజాగా ఆరు వందలు తగ్గి 1,26260 గా ఉంది. అయితే ఈ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మధ్య తరగతి కుటుంబీకుల ఆశ మాత్రం లక్ష లోపలి రేటు ఇప్పుడు దిగుతుందా అని ఆశిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుద్దో చూడాలి.