కొన్ని రోజుల క్రితం యాంకర్ శివజ్యోతి తిరుమల వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. తిరుమల లో ప్రసాదం తింటూ రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ చేసిన వీడియో నెట్టింట వివాదాస్పదమవగా, శివజ్యోతిని తిట్టిన తిట్టు తిట్టకుండా ట్రోల్ చేశారు. అయితే శివజ్యోతి వెంటనే రియాక్ట్ అయ్యి క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసింది. వివరాల్లోకి వెళితే తన తమ్ముడు సోను తో కలిసి తిరుమల సన్నిధి లో దర్శనం కోసం క్యూ లో ఉన్న లైన్లో ప్రసాదం తీసుకుంటూ ఇలా అంది. “ఫ్రెండ్స్ మా తమ్ముడు కాస్ట్లీ ప్రసాదం ఆడుకుంటున్నాడు.. మేము రిచెస్ట్ బిచ్చగాళ్లం” అంటూ వీడియో చేసింది. దీనికి నెట్టింట భారీగా విమర్శలొచ్చాయి.
అయితే శివజ్యోతి వెంటనే క్షమాపణ కోరుతూ, తానూ తప్పు చేసానని, అయితే అది ఇంటెన్షన్ లో చేయలేదని, కాస్ట్లీ లైన్ లో నిలబడ్డామనే అర్థంలో అలా చెప్పానని, వెంకన్న స్వామి తమకు అన్నీ ఇచ్చారని, తెలిసో తెలియకో తప్పు జరిగింది నన్ను క్షమించండి” అంటూ వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలో టిటిడి శివజ్యోతిని బహిష్కరించిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టిటిడి శివజ్యోతి ఆధార్ కార్డు ని టిటిడి సైట్ నుండి ఆమెను బ్లాక్ చేసారని, మరెన్నడు ఆమె తిరుమలకు రాకుండా బహిష్కరించారని వార్తలు వస్తున్నాయి. అయితే టిటిడి వర్గాల నుండి వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం శివజ్యోతి కి సంబంధించి ఎటువంటి చర్యలు వారు తీసుకోలేదని, తనపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని తేలింది. ఒకవేళ ఇలాంటి సంఘటనలపై ఏమైనా చర్యలు తీసుకుంటే టిటిడి నుండి అధికారిక ప్రకటన వస్తుందని అధికారిక వర్గాల సమాచారం. ఏది ఏమైనా కొంత కాలం వరకు శివజ్యోతిపై భక్తుల ట్రోలింగ్ తప్పేలా లేదు.
