Indias costliest number plate

ఈ నెంబర్ ప్లేట్ ధర బెంజ్ కన్నా ఎక్కువ!

మామూలుగా ఒక కారు నెంబర్ ప్లేట్ ఫ్యాన్సీ ధర ఎంత ఉంటుంది.పది వేలు, ఇరవై వేలు, మహా అయితే ముప్పై వేలు.. కదా.. కానీ ఒక నెంబర్ ప్లేట్ ధర ఒక BMW కార్ రేంజ్ ని మించి ఉందంటే నమ్మగలరా! కానీ ఇది నిజం. తాజాగా ఒక కారు యొక్క నంబర్ ప్లేట్ ధర అక్షరాలా (1.17 cr) కోటి పదిహేడు లక్షలు పలికింది. ఇది హర్యానా రాష్ట్రంలో కుండ్లి RTO ఆఫీస్ విభాగంలో రీసెంట్ గా నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో “HR88B8888” అనే VIP నెంబర్ దాదాపు కోటి పదిహేడు లక్షల రికార్డు ధర పలికండి. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ అని సమాచారం.

అయితే HR88B8888 అనే ఈ నెంబర్‌ కి ఇంత రేటు పలకడానికి మెజారిటీగా న్యూమరాలజీ పట్ల ఆసక్తి ఉన్న వారు ఆసక్తి చూడడం అని అంటున్నారు. అలాగే కొంత మందికి సెంటిమెంట్లు కూడా కారణం, ఆ సంఖ్యల్లో వారికి ఇష్టమైన నంబర్స్ ఉండడం, వారి పుట్టిన రోజులు కలిసొచ్చేలా ఉండడం మరేదైనా కారణాలు అయి ఉండవచ్చు. అలాగే ఈ నెంబర్ ప్లేట్ లో 8 సంఖ్యలు ఉండగా వాటి మధ్యలో B అక్షరం కలిసిపోయి ఉంది. ఇది దూరం నుండి గమనిస్తే 8 లాగే కనిపిస్తుంది. అందుకే ఈ నెంబర్ ప్లేట్ ను దక్కించుకోవడానికి దేశంలో ప్రముఖ ధనవంతులు పోటీ పడ్డారు.

ఇక ఈ నెంబర్ ప్లేట్ కోసం దాదాపు 45 మంది ధనవంతులు ప్రధానంగా పోటీపడగా లక్ష నుండి ప్రారంభమై ఏకంగా కోటి పదిహేడు లక్షలకు చేరుకుంది. ఇది ఒక BMW X5, Benz కార్ల కన్నా ఎక్కువట.