Karthi's Annagaru Vastunnaru movie postponed

అఖండ పరిస్థితే అన్నగారికి వచ్చింది

గత వారం బాలకృష్ణ అఖండ తాండవం సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సినిమా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఇయర్ రిలీజ్ అవుతుందో కాదో అన్న అనుమానం నుంచి సరిగ్గా రెండు మూడు రోజుల్లోనే నిర్మాతలు తమ సమస్యలు పరిష్కరించుకుని అఖండ 2 ని వారం ఆలస్యంగా ఈ వారం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అయితే నిర్మాతలు గతంలో ఇతర నిర్మాణ సంస్థలలో భాగమై కొన్ని సినిమాల నిర్మాణంలో డబ్బుల విషయమై ఆలస్యం చేసినందువల్ల అఖండ 2 సినిమాని రిలీజ్ చేయనీయకుండా అడ్డుకుని కోర్టులో కేసు వేశారు. అయితే ఆ సమస్యలని ఇప్పుడు క్లియర్ చేసుకుని అఖండ 2 ఫైనల్ గా రేపు రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు అఖండ 2 కి వచ్చిన పరిస్థితే మరో స్టార్ హీరో సినిమాకు వచ్చి పడింది.

తమిళ స్టార్ కార్తీ నటించిన “అన్నగారు వస్తారు” సినిమా ఈ వారం డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా, ఫైనల్ గా సినిమా రిలీజ్ కాకుండా వాయిదా పడింది. ఈ సినిమా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ వారికి ఫైనాన్సియల్ సమస్యలు ఉన్నాయని ఈ కారణంగా వాయిదా పడొచ్చు అనే రూమర్స్ కొన్ని రోజులుగా వస్తూనే ఉండగా, ఫైనల్ గా ఇప్పుడు అదే కంఫర్మ్ అయింది. అన్నగారు వస్తున్నారు సినిమాని అధికారికంగా వాయిదా వేసినట్టు యూఎస్ డిస్ట్రిబ్యూషన్ వారు కన్ఫర్మ్ చేశారు. అందువల్ల తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ అన్నగారు వస్తున్నారు సినిమా వాయిదా పడింది.

ఇలా బాలకృష్ణ సినిమా పరిస్థితే కార్తీ సినిమాకి వచ్చిందని చెప్పాలి. మరి అఖండ 2 మేకర్స్ వాళ్ళ ప్రాబ్లెమ్స్ క్లియర్ చేసుకున్నట్టు స్టూడియో గ్రీన్ వారు కూడా తమ సమస్యలు తొందరగా పరిష్కరించుకుని అన్నగారు వస్తున్నారు సినిమాని తొందర్లోనే థియేటర్లలో రిలీజ్ చేయడానికి కొత్త డేట్ తో వస్తారా లేదా అన్నది చూడాలి.