సినిమా ఇండస్ట్రీలో కొన్ని నిర్మాణ సంస్థలు దేశ వ్యాప్తంగా 80స్ లోనే గుర్తింపు తెచ్చ్చుకున్నాయి. భారీ బడ్జెట్ తో అత్యుత్తమ చిత్రాలు నిర్మించి తమకంటూ ఇండస్ట్రీలో మంచి బ్రాండ్ ఏర్పరచుకొన్నఅతి తక్కువ నిర్మాణ సంస్థల్లో “AVM ప్రొడక్షన్ హౌస్” ఒకటి. అయితే ఈ నిర్మాణ సంస్థ అధినేత అయిన తమిళ చిత్ర నిర్మాత శరవణన్ నేడు తన 86వ ఏట తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం పూట చెన్నైలోని ఆయన స్వగృహంలో కన్నుమూయగా, తమిళ సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రజినీకాంత్, కమల్ హాసన్ సహా, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలు శరవణన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
ఇక శరవణన్ సినిమాల విషయానికొస్తే, ఆయన తండ్రి అయిన ఏవి మేయప్పన్ 1945 లో ఏవిఎం ప్రొడక్షన్స్ ని స్థాపించి పలు ప్రముఖ చిత్రాలను నిర్మించారు. ఇక 1940 లో జన్మించిన శరవణన్ ఆయన తండ్రి స్థాపించిన AVM నిర్మాణ సంస్థను కొనసాగిస్తూ, తండ్రి అడుగుజాడల్లో దేశ వ్యాప్తంగా పలు భారీ చిత్రాలను నిర్మించారు. భారీ చిత్రాలైన శివాజీ, అయాన్ (వీడోక్కడే), యజమాన్, తిరుపతి చిత్రాలను నిర్మించారు శరవణన్.
ఇక తెలుగులో కూడా 70 ల కాలంలో “భక్త ప్రహ్లాద”, మూగ నోము వంటి చిత్రాలతో పాటు సంసారం ఒక చదరంగం, నాగు, ఆ ఒక్కటి అడక్కు, జెమిని, లీడర్ లాంటి ఉత్తమ సినిమాలు అందించారు. ఇక శరవణన్ వయసు రీత్యా సినిమాలు తీయడం పదేళ్లుగా తగ్గించగా, అదే వయసు రీత్యా పలు ఆరోగ్య కారణాల మూలాన తుది శ్వాస విడిచారు.
