ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 ఆక్షన్ అబుదాబి వేదికగా ఈరోజు అనగా మంగళవారం డిసెంబర్ 16న గ్రాండ్ గా జరిగింది. అయితే ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్ల కంటే యువ ఆటగాళ్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు ఐపీఎల్ టీమ్ ల యజమానులు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక్క అంతర్జాతీయ ఆట కూడా ఆడని వాళ్ళకి కోట్లు కుమ్మరించి దక్కించుకున్నారు. ఇక ఈ ఐపీఎల్ వేలం ప్రధానంగా KKR (కోల్ కత్తా నైట్ రైడర్స్) CSK (చెన్నై సూపర్ కింగ్స్) మధ్య ఆసక్తికరంగా సాగింది.
ఇక 2026 IPL ఆక్షన్ లో అత్యధిక రేటు విదేశీ అతగాడికి చెల్లించారు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడైన ఆల్ రౌండర్ “కామెరూన్ గ్రీన్” కి ఏకంగా 25.20 కోట్లు వెచ్చించి కేకేఆర్ టీమ్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రేటు పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు.
ఇదిలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం ఈసారి యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎంతలా అంటే ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్ లు అన్ క్యాప్డ్ ప్లేయర్ల (Uncapped Players) కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ అనే ఇద్దరు యువ ఆటగాళ్లను CSK టీమ్ చెరో రూ.14 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. ఇది కూడా ఐపీఎల్ లో కొత్త ఆటగాళ్లకు ఈ స్థాయిలో వెచ్చించడం తొలిసారి అని చెప్పాలి.
వీళ్ళతో పాటు ఐపీఎల్ లో అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన ప్లేయర్లను గమనిస్తే..
కామెరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా) : 25 కోట్లు (కేకేఆర్)
మతీశ పతిరానా (శ్రీలంక) : 18 కోట్లు (కేకేఆర్)
కార్తీక్ శర్మ : 14.20 కోట్లు (సిఎస్కె)
ప్రశాంత్ వీర్ : 14.20 కోట్లు (సిఎస్కె)
రవి బిష్ణోయ్ : 7.20 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) : 7 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
వెంకటేశ్ అయ్యర్ : 7 కోట్లు (ఆర్సీబీ)
డేవిడ్ మిల్లర్ : 2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
క్వింటన్ డికాక్ : 1 కోటి (ముంబై ఇండియన్స్)
వీళ్ళే గాక మరికొందరు ఆటగాళ్లను ఐపీఎల్ వేలంలో మంచిధరకు అమ్ముడుపోగా, పృత్వి షా, సర్పరాజ్ ఖాన్, బెయిర్ స్ట్రో లాంటి ఆటగాళ్లని కొనుగోలు చేయడానికి ఏ ఐపీఎల్ టీం ఆసక్తి చూపలేదు.
