టాలీవుడ్ లో ఈ ఇయర్ లో ఏకంగా అరడజను సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుండగా, అందులో “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార (Nayanathara) హీరోయిన్ గా నటించగా జనవరి 12 2026న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాపై ముందుగా పెద్దగా అనుకున్న రేంజ్ లో అంచనాలు లేకపోయినా, రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసింది. లాస్ట్ ఇయర్ అనిల్ (Anil ravipudi) డైరెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki vastunnam) ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు ఈ సినిమాని కూడా సంక్రాంతి బరిలో దించుతున్నారు.
ఇక సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో ఫినిష్ అయిపోగా, గత కొన్ని రోజుల నుండే మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. ఇక ఈ మన శంకర వర ప్రసాద్ మూవీ లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా ప్రత్యేక అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరిన్ని అంచనాలు పెరిగిపోగా, మొన్న చిరు, వెంకీ సాంగ్ రిలీజ్ తో అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి. ఇక ఇప్పుడు మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచారు.
తాజాగా నయనతార తో చిన్న ప్రమోషనల్ వీడియో చేయించగా, కొన్ని గంటల క్రితమే ట్రైలర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు. ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 4న మధ్యాహ్నం 1.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతి రోజు నుంచే మేకర్స్ పలు ఇంటర్వ్యూ లు ప్లాన్ చేయనుండగా, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు సమాచారం. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram charan గెస్ట్ గా హాజరవనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
