భారత్ లో ఉన్న రాజకీయ పార్టీల్లో బిజెపి – ఎంఐఎం భిన్న ధృవాలుగా ఉండేవని తెలిసిందే. రెండు పార్టీల మధ్య ఎప్పటికప్పుడు పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనేలా వైరం ఉంటుంది. పైగా హిందుత్వమే ప్రధానంగా బిజెపి ఏర్పాటయితే, ముస్లిం వర్గం కోసం ఎంఐఎం పార్టీ ఏర్పడింది. అయితే రీసెంట్ గా జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీహార్ లో ఎంఐఎం గెలిచిన ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ అధినేత అసీదుద్దిన్ ఓవైసీ బిజెపిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఒకింత ఆశ్చర్యానికి కూడా గురి చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే బీహార్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీ తో గెలవగా, ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతమైన సీమాంచల్ లో మాత్రం కాస్త బిజెపి మెజారిటీ తగ్గిందని చెప్పాలి. ఈ ప్రాంతంలో దాదాపు 24 అసెంబ్లీ సీట్లు ఉంటే ఎన్డీయే 14 సీట్లు మాత్రమే గెలుచుకోగా, 5 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించడం విశేషం. అయితే బీహార్ లోని అమౌర్ లో తాజాగా హైదరాబాద్ ఎంపీ మరియు ఎంఐఎం పార్టీ అధినేత అయిన అసదుద్దీన్ ఒవైసి ర్యాలీలో పాల్గొనగా బిజెపికి మద్దతిస్తూ సంచలనానికి తెరలేపారు.
ఆ ర్యాలీలో అసీదుద్దిన్ మాట్లాడుతూ ఎప్పుడూ వరదలు, వలసలు, అవినీతి లాంటివి జరిగే సీమాంచల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి బిజెపికి తాము మద్దతు ఇస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే హైదరాబాద్ లో ముందుముందు జరిగే ఎన్నికలను ఉద్దేశించి బిజెపితో మిత్రత్వం కోరుకుంటూ అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేసారా అంటూ చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా బిజెపి నేతల నుండి మాత్రం ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన రాలేదని చెప్పాలి.
