భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూడ్డానికి ఎంత సింపుల్ గా కనిపిస్తారో అందరికి తెలిసిందే. ఆయన ఆహారపు అలవాట్లు కూడా పల్లెటూళ్లలో పెద్ద మనుషులు తినే విధంగా కొంచెం రొట్టె పప్పన్నం చాలు అన్నట్టుగా ఉంటాయి. అలాగే వస్త్రధారణ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ ఆ సింపుల్ డీసెంట్ డ్రెస్ తోనే రాయల్ గా కనిపిస్తుంటారు. అయితే తాజాగా మోడీ ధరించిన వాచ్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
తాజాగా పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరైన మోడీ అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి మోడీతో పాటు ఆయన చేతికున్న వాచ్ మరింత ఆకర్షిస్తుంది. అయితే ఆ వాచ్ మోడల్ పేరు “రోమన్ బాగ్”. సెప్టెంబరు నుంచి మోడీ ఈ వాచీని ధరిస్తున్నారట. ఈ వాచ్ లోపల 1947 నాటి అసలైన రూపాయి నాణెం ఉండడం వల్ల మరింత ఆకర్షిస్తుంది. పైగా ఆ నాణెంపై నడుస్తున్న పులి బొమ్మ మరింత ఆకర్షిస్తుంది. అయితే మోదీ ప్రభుత్వం గట్టిగా చెప్పే మేకిన్ ఇండియాకు ప్రతిరూపంగా ఈ వాచీని చూస్తారని అభిమానులు అంటూ ఉంటారు.
అయితే ప్రముఖ వ్యాపారవేత్త రావ్ మోహతా స్థాపించిన జైపూర్ వాచ్ కంపెనీ మోడీ ధరించిన ఈ రోమన్ బాగ్ వాచ్ ను తయారుచేసింది. 316 L స్టెయిన్ లెస్ స్టీల్ తో దీన్ని రూపొందించారు. ఈ వాచి ఖరీదు 55 వేల నుంచి రూ.65 వేల వరకు ఉంటుందని సమాచారం.
