దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో విమాన సంస్థ నుండి గత వారం రోజులుగా ప్రయాణికులు రకరకాల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మూడు రోజుల కిందట దేశంలో ఎప్పుడూ లేనట్టుగా ఐదు వందల విమాన ప్రయాణాలు రద్దు చేయడం షాకింగ్ గా మారింది. దాదాపు రెండు వేలకు పైగా ఇండిగో తమ సర్వీసులను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రయాణికుల సమస్యలు ఎక్కడివక్కడ తీర్చేసాక, ఇండిగో ఫైలెట్ల కు, అలాగే ఎయిర్ హోస్ట్ లకు అలాగే ఇతర ఉద్యోగులకు, వారి పని నుండి కాస్త ఒత్తిడి తగ్గించేందుకు ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా ఇండిగో సంస్థ వల్ల ప్రజలకు జరిగిన ఇబ్బందులను గమనించి కేంద్రం ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండిగో వారి సర్వీసులను పునరుద్ధరించే పని మొదలెట్టారు. దాదాపు పది రోజుల్లో సొల్యూషన్ చెప్తామని కేంద్రానికి ప్రకటించారు. ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఎయిరిండియా భారీగా పైలట్ల నియామాలకు నోటిఫికేషన్ జారీ చేసారు. అనుభవజ్ఞులైన బీ737, ఏ320 పైలట్ల కోసం ఇండిగో సంస్థ ఆహ్వానం పంపింది. ఆసక్తి ఉన్న ఫైలట్లు డిసెంబరు 22వ తేదీలోపు అప్లై చేసుకోమంటూ ప్రకటన జారీ చేయడం జరిగింది.
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి లోగా 900 మంది ఫైలెట్లను నియమించనున్నట్టు ఇండిగో సంస్థ ప్రకటించింది. అలాగే ఇప్పటికే 250 మంది జూనియర్ ఫస్ట్ అధికారులకు ట్రైనింగ్ ఇస్తున్న ఇండిగో వచ్చే ఏడాది లోగా 300 వందల మంది కెప్టెన్లు, ఆరు వందల మంది ఇండిగో అధికారులను వివిధ కేటగిరీల్లో నియమించుకోనున్నారు. ఇక ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాదనీ కేంద్రానికి ఇండిగో సంస్థ హామీ ఇచ్చింది.
