Samantha Ruth Prabhu marries director Raj Nidimoru

సమంత కొత్త అధ్యాయం.. వివాహబంధంలోకి అడుగు

స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ ఇయర్ “శుభం” అనే సినిమాలో నటించిన సమంత ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. అయితే తాజాగా సమంత తన లైఫ్ గురించి సరికొత్త న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. తాను వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్టు సమంత అఫిషియల్ గా కంఫర్మ్ చేసేసింది. నేడు తెల్లవారుజామున కోయంబత్తూర్ లోని ఈషా యోగా ఫౌండేషన్ లో సమంత – రాజ్ నిడిమోరు జంట పెళ్లి జరిగింది. ఇక రాజ్ నిడిమోరు ఎవరో కాదు, ఇండియన్ సెన్సేషన్ “ది ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ దర్శకుల్లో ఒకరు.

ఇక ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 2 లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ నుంచే క్లోజ్ అయిన సమంత రాజ్, గత కొంత కాలంగా డేట్ లో ఉన్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అది కంఫర్మ్ చేస్తూ ఏకంగా పెళ్లి చేసేసుకున్నారు. ఇక రాజ్ – డీకే ద్వయం తెరకెక్కించిన “సిటడెల్‌” – హనీ బన్నీ” లో కూడా సమంత నటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సమంత తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ పోస్ట్ చేసింది. సమంత ” తన ఫ్యామిలీ, ఇంకా ఫ్రెండ్స్‌ సమక్షంలో ఈ పెళ్లి చేసుకున్నానని, గత ఏడాదిన్నరగా తన కెరీర్‌ లో సాహసోపేతమైన అడుగులు వేశానని, ఎంతో రిస్క్‌ తీసుకున్నానని, లైఫ్ లో ఎలా ముందుకు వెళ్లాలో నేర్చుకున్నానని, అలాగే ఇది కేవలం ఆరంభమే” అని చెప్తూ పోస్ట్ చెడింది.

అలాగే వాళ్ళు దిగిన పెళ్లి ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. ఇక రాజ్ దర్శకత్వంలో రాబోయే మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్టు సమాచారం.