నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖండ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టీజర్ నుండి పాటల దాకా ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇక తాజాగా అఖండ 2 నుండి ఫ్యాన్స్ ఫైనల్ గా ఎదురుచూస్తున్న మాస్ అప్డేట్ వచ్చేసింది.
అఖండ 2 ట్రైలర్ ని నవంబర్ 21న సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్ ఈవెంట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని మేకర్స్ ప్రకటించారు. అఖండ 2 ట్రైలర్ లాంచ్ కి కర్ణాటకలో చింతామణి ఊరు వేదికగా కన్ఫర్మ్ చేశారు. ఇక బాలయ్య, శివరాజ్ కుమార్ ఫ్రెండ్షిప్ మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. ఇంతకుముందు కూడా బాలయ్య కోసం గౌతమీపుత్ర శాతకర్ణి లో ప్రత్యేక పాటలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖండ2 ట్రైలర్ లాంచ్ వేదికపై ఇరువురు స్టార్ హీరోలు వారి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.
ఇక ఈ సినిమాకు 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తుండగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డిసెంబర్ 5న అఖండ 2 ని పాన్ ఇండియా భాషల్లో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
